Chandrayaan3: అడుగు దూరంలో జాబిల్లి.. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యావత్ భారతావని..

చంద్రుడి వైపు చంద్రయాన్ 3 దూసుకెళ్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఒక్కో పని చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ ను వేరు చేశారు. శుక్రవారం నుంచి శాస్ర్తవేత్తలు విక్రమ్ ల్యాండర్ డీబూస్ట్ చేస్తున్నారు. 30 కి.మీ. పెరిలూన్ (చంద్రునికి కక్ష్య అత్యంత సమీప బిందువు), 100 కి.మీ. అపోలూన్ (చంద్రుని నుండి అత్యంత దూరపు స్థానం) ఉన్న కక్ష్యలో దాని స్థానం కోసం "డీబూస్ట్" (నెమ్మదించే ప్రక్రియ) చేయడం మొదలుపెట్టారు.

కాగా ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష్యలో నెలలు లేదా సంవత్సరాల పాటు దాని ప్రయాణాన్ని కొనసాగించనుంది. చంద్రయాన్ 3ప్రయోగాన్ని జూలై 14న చేపట్టారు. అప్పటి నుంచి క్రమక్రమంగా చంద్రయాన్ చంద్రుడి వద్దకు తీసుకెళ్లారు. మొదట భూ కక్ష్యలో తిరిగిన చంద్రయాన్ ను ఆగస్ట్ 1న ఆర్బిటాల్ ప్రవేశపెట్టారు. ఆగస్టు 5 న చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత క్రమంగా దూరాన్ని తగ్గిస్తూ చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. బుదవారం రోజు చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు.

ISRO scientists are gradually reducing the speed of Chandrayaan 3 lander

గురువారం రోజు ల్యాండర్ మాడ్యూల్ ను వేరు చేశారు. ఇప్పుడు ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. ఈ ల్యాండర్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపే పరిశోధనలు చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి పైకి ల్యాండర్, రోవర్ పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా చంద్రుడి పైకి రోవర్లను పంపాయి.

ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే రెండు సార్లు చంద్రుడిపైకి రోవర్లను పంపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం ఈ ప్రయోగం విజయవంతం కావాలని యావత్ భారత దేశం కోరుకుటుంది. భారత తర్వాత రష్యా ప్రయోగించిన లూనా-25 కు చంద్రుడిపై దిగేందుకు సిద్ధమైంది. లూనా-25 ఆగస్టు 21 నుంచి 23 మధ్య చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+