Atiq Ahmed: 50 రోజుల్లో మట్టిలో కలిసిన మాఫియా సామ్రాజ్యం: యోగి ద హీరో
లక్నో: గ్యాంగ్‌స్టర్, లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా మరణించారు. ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిద్దరినీ మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

అత్యంత సమీపం నుంచి అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి వారిద్దరిపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో- పోలీసులు అందరూ చూస్తోండగానే అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. అతిక్ అహ్మద్ తలపై తుపాకీని పెట్టి కాల్పులు జరిపాడొకడు. ఆ వెంటనే అతిక్ కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు జరిపారు.
యూపీ: షూటౌట్ లో మృతి చెందిన మాఫియా లీడర్ అతీక్ అహ్మద్,అతని సోదరుడు..!! pic.twitter.com/ukM93jc0ZD
— oneindiatelugu (@oneindiatelugu) April 15, 2023
ఊహించని ఈ ఘటనతో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. నేలపై కుప్పకూలిన అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి పారిపోయారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రయాగ్ రాజ్ పోలీసులు నిర్ధారించారు. వారిని అరెస్ట్ చేశారు.
వారిని లవ్‌లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు పోలీసులు. కాల్పులు జరడానికి ఉపయోగించిన తుపాకీ, ఖాళీ బుల్లెట్ మ్యాగజైన్లు, వారు ప్రయాణించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఖత్రి, నగర పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
కాగా- తమ రాష్ట్రంలో మాఫియా ఛాయలు కూడా ఉండబోవని, వారిని మట్టిలో కలిపేస్తామంటూ కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిండు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే తొలుత గ్యాంగ్‌స్టర్, మాఫియా డాన్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా అతిక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురయ్యారు.
ఇదంతా 50 రోజుల వ్యవధిలోనే చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతిక్ అహ్మద్ 1,400 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది కూడా. డొల్ల కంపెనీలను సృష్టించి పెద్ద ఎత్తున బ్లాక్ మనీ మార్పిడి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనిపై వంద క్రిమినల్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లల్లో నమోదై ఉన్నాయి.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications