Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IstandWithSonuSood Trending సోనుసూద్ పై రెండో రోజు ఐటీ తనిఖీలు ; బీజేపీపై సోషల్ మీడియాలో రచ్చ

రియల్ లైఫ్ హీరో , బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ నివాసానికి మరోమారు ఐటి అధికారులు చేరుకుని సర్వే ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. ఆదాయపు పన్ను అధికారులు రెండవ రోజు సోనూ సూద్ నివాసంలో సర్వే ఆపరేషన్ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఆయన అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సోనూ సూద్ నివాసానికి చేరుకున్న ఐటి అధికారులు లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ సోనూసూద్ చేసుకున్న ఒప్పందంపై ప్రశ్నిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. సర్వే కొనసాగుతున్నందున ఈ దశలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోను సూద్ పై కొనసాగుతున్న సర్వే ఆపరేషన్ పై ఎలాంటి సమాచారాన్ని పంచుకోవడం లేదు.

ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ట్రెండ్ #ISTANDWITHSONUSOOD

ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ట్రెండ్ #ISTANDWITHSONUSOOD

సోను సూద్ ను 'నిజమైన హీరో' అని పేర్కొంటూ పలువురు ట్విట్టర్‌లో తమ మద్దతును తెలియజేశారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న, సామాజిక కార్యక్రమాల ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్న పేదల పెన్నిధి సోనూసూద్ అని గుర్తు చేస్తున్నారు. కొనసాగుతున్న ఐటీ అధికారుల సర్వే ఆపరేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరోనా మహమ్మారి తో భారత దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో, నిరుపేదలకు అండగా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన సోను సూద్ ఎంత మంది నిరుపేదలకు దేవుడయ్యాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో అభిమానులు ట్విట్టర్‌లో సోనూ సూద్ కు తమ మద్దతును తెలిపారు.

నిన్న 20 గంటల పాటు సర్వే ఆపరేషన్ .. నేడు కూడా ఆపరేషన్ కొనసాగింపు

ఇక నిన్నటికి నిన్న దాదాపు 20 గంటలపాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే ఆపరేషన్ కొనసాగించారు. సెప్టెంబర్ 15 న, ఆదాయపు పన్ను శాఖ సోనూసూద్ కు సంబంధించిన ఆస్తులపై సర్వే కార్యకలాపాలను ప్రారంభించింది. ముంబైలోని నటుడికి సంబంధించిన ఆరు ప్రాంగణాల్లో రెండో రోజు కూడా సర్వే నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత అనుమానాల నేపథ్యంలో ఈ సర్వేలను నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. రెండవ రోజు సోను సూద్ నివాసంలో ఆదాయపు పన్ను అధికారులు తమ సర్వేను కొనసాగిస్తుండగా, దేశవ్యాప్తంగా ఉన్న సోనూసూద్ అభిమానులు ట్విట్టర్‌లో #IstandWithSonuSood ట్రెండ్ చేస్తున్నారు.

 సోను సూద్ కు ఫ్యాన్స్ , నెటిజన్ల మద్దతు

సోను సూద్ కు ఫ్యాన్స్ , నెటిజన్ల మద్దతు

మీరు యూత్ ఐకాన్... మేము మీతో ఉన్నాము అంటూ కొందరు, ఇతరుల కోసం జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి పని చేయడం నిజంగా గొప్ప విషయమని, అలాంటి పని చేసిన సోనూసూద్ ఫౌండేషన్ కు, సోనూ సూద్ కు తాము అండగా ఉంటామని కొందరు చెబుతున్నారు. సోనూసూద్ ని ఒక నిజమైన హీరో అంటూ కరోనా లాక్డౌన్ సమయం నుండి ఇప్పటివరకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవని పలువురు ప్రశంసిస్తూ సోనూసూద్ కు అండగా తాము ఉన్నామని చెప్తున్నారు.

సోను సూద్ పై ఐటీ అధికారుల సర్వే ఆపరేషన్ పై విమర్శలు .. ప్రజల్లో వ్యతిరేకత

ఇంకొందరు ప్రస్తుతం సోను సూద్ పై అధికారుల సర్వేలపై చాలా బాధగా ఉందని, సహాయం చేసే వ్యక్తులను, టార్గెట్ చేయడం నిజంగా సిగ్గుచేటని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్మును దోచుకుని దాచుకునే వారిపై దాడులు చెయ్యరని, మంచివాళ్లనే టార్గెట్ చేస్తారని మండిపడుతున్నారు. సోనుసూద్ అభిమానులు, ఆయన ద్వారా సహాయం పొందిన వారు ప్రస్తుతం ఆయనపై జరుగుతున్న ఐటీ తనిఖీలను తప్పుబడుతున్నారు. మంచి చేసే వ్యక్తులను ఎందుకిలా ఇబ్బంది పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

 బీజేపీ టార్గెట్ గా సోషల్ మీడియాలో నిప్పులు

బీజేపీ టార్గెట్ గా సోషల్ మీడియాలో నిప్పులు

ప్రభుత్వాల తీరు విస్మయం కలిగిస్తోంది అంటూ మండిపడుతున్నారు. మంచి మనసున్న, సహాయం చేసే గొప్ప గుణం ఉన్న వారికి ఇలాంటి కష్టాలు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాల వల్లే సోను సూద్ టార్గెట్ అయ్యారని అంటున్నారు. కేంద్రం తన పవర్ దుర్వినియోగం చేస్తుందని, కావాలనే సోను సూద్ పై తనిఖీలను చేయిస్తుందని విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ తాను చెప్పిన మాట సోను సూద్ వినాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుందని మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+