శశికళ ఫ్యామిలీకి షాక్: చిన్నమ్మ బినామి వివేక్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్, ఏం జరుగుతుందో !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ మేనల్లుడు, జయ టీవీ ఎండీ, జాజ్ సినిమాస్ సీఇవో వివేక్ బ్యాంక్ అకౌంట్స్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. శశికళ బినామిగా ఉన్న వివేక్ అక్రమాస్తులను గుర్తించిన అధికారులు షాక్ కు గురైనారు.

గత నాలుగు రోజులుగా తమిళనాడులో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం వివేక్ అక్రమాస్తులు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు అతని అకౌంట్లు సీజ్ చెయ్యాలని అధికారులు ఆదేశించారని తెలిసింది.

IT department has raided Vivek's house and his office.

జయా టీవీ ఎండీగా, జాజ్ సినిమాస్ సీఇవోగా ఉన్న వివేక్ అక్రమాస్తులు సంపాధించారని, శశికళకు బినామీగా ఉన్నారని ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వివేక్ ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాదించాడని వెలుగు చూడటంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వివేక్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చెయ్యడంతో మన్నార్ గుడి మాఫియా హడలిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT department has raided Vivek's house and his office. They have freezed his bank accounts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి