మరో 60వేల మందికి నోటీసులు? నల్లధనం ఉందనే?

మరో 60 వేల మందికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. వీరంతా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేయనుందని అ

న్యూఢిల్లీ: మరో 60 వేల మందికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. వీరంతా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేయనుందని అధికారులు తెలిపారు.

నల్లధనం నిర్మూలన కార్యక్రమం రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్నుశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా 60 వేల మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టుగా సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ టాక్సెస్ నిర్ణయం తీసుకొంది.

IT department to issue notices to 60,000 persons with black money

డీమానిటీజైషన్ తర్వాత నల్లధనం నిర్మూలన ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకొంది ఆదాయపు పన్ను శాఖ.అయితే ఆదాయపు పన్ను శాఖ అనేక ఖాతాలను పరిశీలిచిన మీదట ఈ 60 వేల మంది ఇంకా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.దీంతో ఈ మేరకు వీరందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకొంది.

తొలి రౌండ్ లో ఆదాయపు పన్నుశాఖాధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున నల్లదనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం రెండవ విడత నల్లధనాన్ని వెలికి తీసే కార్యక్రమం సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మేరకు 60వేల మందికి నోటీసులు జారీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+