హవాలా కేసు: కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌కు ఐటీ నోటీసులు
కర్నాటక భారీ నీటి పారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్‌కు ఆదాయపు పన్న శాఖ నోటీసులు పంపింది. ఏఐసీసీకి హవాలా ద్వారా రూ.5కోట్లు ముట్టజెప్పారని గుర్తించిన ఐటీ శాఖ శివకుమార్‌కు నోటీసులు పంపింది. శివకుమార్ అతని స్నేహితుడు సునీల్ కుమార్ శర్మలు శర్మ ట్రావెల్స్ నుంచి రూ.5 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ శర్మ అతని బంధువులకు కూడా నోటీసులు పంపినట్లు ఐటీ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే కేంద్రం తనపై రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని శివకుమార్ ఆరోపించారు. గతేడాది ఆగష్టులో శివకుమార్ ఆస్తులపై ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులు త్వరలోనే బెంగళూరులోని ప్రత్యేక ఆర్థిక నేర విభాగం కోర్టు విచారణ చేయనుంది. పన్ను ఎగవేశారంటూ శివకుమార్ పై ఐటీ మూడు కేసులు నమోదు చేసింది.

ఆ రోజు నిర్వహించిన సోదాల్లో ఐటీ శాఖ రూ. 10 కోట్లు స్వాధీనం చేసుకుంది.ఈ మొత్తాన్ని ఢిల్లీ, కర్నాటక స్టేట్ ఎంప్లాయిస్ నివాస గృహాలు, బెంగళూరు శివారుల్లోని ఈగల్టన్ రిసార్ట్ నుంచి దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా డీకే శివకుమార్ పై ఐటీ శాఖ నాలుగో కేసు నమోదు చేసింది. కేంద్రం తనపై కక్ష సాధిస్తోందని ఆరోపించిన శివకుమార్ చట్టానికి లోబడుతానని చెప్పారు. ఇలాంటి వాటికి తాను బెదిరేది లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications