
అత్తర్ వ్యాపారి ఇంట్లో గుబాళించిన నోట్ల కట్టలు.. రూ. 257 కోట్ల నగదు, కేజీల కొద్ది బంగారు సీజ్
ఉత్తరప్రదేశ్‌లో అత్తర్ వ్యాపారి పీయూష్ జైన్ అసలు బండారం బయటపడింది. జైన్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ , జీఎస్టీ అధికారుల జరిపిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 5 రోజుల పాటు జరిపిన ఈ తనీఖీల్లో రూ 257 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిలోల కొద్ది బంగారం, వెండి అభరణాలు, ఖరీదైన ఆస్తుల పత్రాలను గుర్తించారు. సుమారు వెయ్యి కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సాధారణ అత్తర్ వ్యాపారిగా ఛలామణి అవుతున్న షీయూష్ జైన్ అసలు బండారం బట్టబయలైంది..

రూ. 257 కోట్ల అక్రమ నగదు..
కాన్పూర్ కు చెందిన అత్తర వ్యాపారి పీయూష్ జైన్ ఇల్లు , కార్యాలయాలు, ఫ్యాక్టరీలలో జరిపిన దాడుల్లో 257 కోట్ల అక్రమ నగదు బయటపడింది. పీయూష్ జైన్ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో గత గురువారం ఐటీ, జీఎస్టీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. ఇంట్లోని రెండు బీరువాల్లో తనిఖీ చేయగా వాటి నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. కట్టలు కట్టలుగా ఉన్న నోట్లను చూసి అధికారులు ఒక్క సారిగా షాక్ తిన్నారు.

25 కేజీల బంగారం... 250 కిలోల వెండి..
షియూష్ జైన్ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలను లెక్కించడానికి అధికారులకు ఐదురోజులు పట్టింది. రూ. 257 కోట్ల నగదుతో పాటు 25 కేజీలో బంగారం, 250 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా దుబాయ్‌లో స్థిరాస్తులకు సంబంధించిన ప్రతాలను కూడా సీజ్ చేసుకున్నారు.

18 లాకర్లు.. 500 తాళాలు
కన్నౌజ్‌లోవ్యాపారి
జైన్
కు
సంబంధించి
పూర్వీకుల
నివావాసంలో
18
లాకర్లను
ఐటీ
అధికారులు
గుర్తించారు.
వీటితో
పాటు
మరో
500
తాళాలు
కూడా
దొరికిట్లు
సమాచారం.
ఆ
లాకర్లను
తేరిచేందుకు
అదికారులు
ప్రయత్నిస్తున్నారు.
ఈ
అక్రమాస్తులను
కూడబెట్టిన
పీయూష్
జైన్‌ను
దాదాపు
50
గంటలకు
పైగా
విచారించారు.
అనంతరం
అతనిని
అరెస్ట్
చేశారు.
నకీలీ
ఇన్వాయిస్
లు,
ఈ
-వే
బిల్లులు
ద్వారా
పన్నులు
ఎగవేత
పాల్పడి
పెద్ద
మొత్తంలో
కూడబెట్టినట్లు
గుర్తించారు.
పన్ను
ఎగవేత
సుమారు
రూ.1000
కోట్ల
వరకు
ఉండోచ్చని
అధికారులు
అంచనా
వేస్తున్నారు.

4. సమాజ్ వాదీ పార్టీ నేతగా ముద్ర..
అయితే పీయూష్ జైన్.. సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు .. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. జైన్ ఇటీవల.. సమాజ్‌వాదీ సెంట్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన అత్తర్ కూడా ఈయన కంపెనీలోనే తయారు చేశారు. దీంతో సమాజ్ వాద్ పార్టీపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పియూష్ జైన్ వ్యవహారం ఉత్తరప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది...