Bengaluru: యుముడి రూపంలో వచ్చిన ఆటో, ట్రాఫిక్ ఏఎస్ఐ బ్రైన్ డెడ్, ప్రాణాలు !
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఎక్కడలేని ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జామ్ అయ్యే సిటీగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న ఆయన్ను ఆటో ఢీకొనడంతో ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
మూడు రోజుల నుంచి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ట్రాఫిక్ విభాగం ఏఎస్ఐ బ్రైన్ డెడ్ అయ్యింది. చికిత్స విఫలమై ఆయన ప్రాణాలు పోయాయి. ట్రాఫిక్ ఏఎస్ఐ అవయవాలు అన్ని దానం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్లకు చెప్పారు. బెంగళూరులోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ లలో పోలీసులు నల్ల బ్యాడ్జీలు వేసుకుని కొంతసేపు మౌనం పాటించారు. ట్రాఫిక్ సిగ్నల్ విధుల్లో ఉన్న ఏఎస్ఐను వేగంగా వెళ్లిన ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ట్రాఫిక్ ఏఎస్ఐ నాగరాజు
బెంగళూరు నగరంలోని హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో నాగరాజు ఏఎస్ఐ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం ఉదయం బసవేశ్వర సర్కిల్ లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి వెళ్లిన ఏఎస్ఐ నాగరాజ్ ట్రాఫిక్ క్లియర్ చెయ్యడానికి ప్రయత్నించారు. అక్కడ ఇద్దరు ట్రాఫిక్ కానీస్టేబుల్స్ కూడా ఉన్నారు. బసవేశ్వర సర్కిల్ లో అనేక మార్గాలు ఉండటం, సమీపంలోనే విధాన సౌధ కూడా ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చెయ్యడానికి ప్రయత్నించారు.

యముడి రూపంలో వచ్చిన ఆటో
గూడ్స్ వాహనాలు అటువైపు రాకుండా చేస్తున్న ఏఎస్ఐ నాగరాజ్ అటువైపు వాహనాలను మళ్లిస్తున్నాడు. ఆ సందర్బంలో వేగంగా వచ్చిన ఆటో నాగరాజ్ ను ఢీకొనడంతో ఎగిరిరోడ్డు మీదపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఏఎస్ఐ నాగరాజ్ తలకు, శరీరంలోని పలుచోట్ల తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే నాగరాజ్ ను పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

బ్రైన్ డెడ్..... అవయవాలు దానం
ఆరోజు నుంచి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్ఐ నాగరాజ్ కు బ్రైన్ డెడ్ అయ్యింది. అయితే చికిత్స విఫలమై ఏఎస్ఐ నాగరాజ్ చనిపోయారు. ట్రాఫిక్ ఏఎస్ఐ నాగరాజ్ అవయవాలు అన్ని దానం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్లకు చెప్పారు. ప్రమాదానికి కారణం అయిన ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. ఆటైమ్ లో ప్రజలకు గులాబ్ జామ్
కొంతకాలంగా బెంగళూరులోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ లలో పరిధిలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం, సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే సమయంలో, తిరిగి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో గూడ్స్ వాహనాలను సిటీలోకి రాకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నా బెంగళూరులో మాత్రం ట్రాఫిక్ కట్టడి చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక మెట్రో రైలు పనులు జరుగుతున్న రోడ్లలో అయితే ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications