బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలను వదిలేసి ?, డ్రైవర్లు ఫైర్, వాహనాలు సీజ్, లూటీ చేస్తున్నారని ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ లు, ఆటోల పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఓలా, ఉబర్, ర్యాపిడో య్యాప్ తో క్యాబ్ లు, ఆటోలు నడుపుతూ సామాన్య ప్రజల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ రవాణా శాఖ అధికారులు క్యాబ్ లు, ఆటోలు సీజ్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రభుత్వ రవాణా శాఖ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ లు, ఆటోల డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని కర్ణాటక రవాణా శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.

Girl: అమ్మ మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ లు పంపించిన అమ్మాయి, ఫోన్ లాక్కొన్న తల్లి, ఆవేశంలో !Girl: అమ్మ మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ లు పంపించిన అమ్మాయి, ఫోన్ లాక్కొన్న తల్లి, ఆవేశంలో !

నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్ ?

నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్ ?

అధిక మొత్తంలో డబ్బులు వసూలు చెయ్యకూడదని నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా బెంగళూరులో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు అధిక మొత్తంలో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ సంస్థల య్యాప్ లతో వాహనాలు నడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ధర్నాలు చేస్తున్న డ్రైవర్లు

ధర్నాలు చేస్తున్న డ్రైవర్లు

నోటీసులు ఇచ్చిన తరువాత కూడా సోమవారం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మంగళవారం ఆటోలు, క్యాబ్ లు సీజ్ చేశారు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థల మీద చర్యలు తీసుకోకుండా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్ల మీద చర్యలు తీసుకుని వారి వాహనాలు సీజ్ చెయ్యడంతో డ్రైవర్లు జయనగరతో ఆర్ టీఓ కార్యాలయం దగ్గర, నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.

ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

ఐటీ హబ్ బెంగళూరుతో సహ కర్ణాటకలో ఆటో డ్రైవర్లు రెండు కిలోమీటర్ల వరకు మినిమమ్ చార్జ్ రూ. 30 వసూలు చెయ్యాల్సి ఉంది. ఈ నియమనిబంధనలు కర్ణాటక ప్రభుత్వం, రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ లు ఉన్న ఆటో డ్రైవర్లు భారీ మొత్తంలో డబ్బులు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారని చాలా మంది ప్రయాణికులు సంబంధిత రవాణా శాఖ అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు.

వార్నింగ్ ఇచ్చిన రవాణా శాఖ అధికారులు

వార్నింగ్ ఇచ్చిన రవాణా శాఖ అధికారులు


ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలతో లింక్ పెట్టుకున్న క్యాబ్, ఆటో అగ్రిగేటర్లు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు ఫిర్యాదులు వచ్చాయని, చట్ట వ్యతిరేకంగా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటామని కర్ణాటక రవాణా శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

సేమ్ సీన్ రిపీట్.... ఆటోలు, క్యాబ్ లు సీజ్

సేమ్ సీన్ రిపీట్.... ఆటోలు, క్యాబ్ లు సీజ్

నోటీసులు ఇచ్చిన తరువాత కూడా బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే ఆ సంస్థల సేవలను నిలిపివేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. నోటీసులు ఇచ్చినా సోమవారం కూడా అధిక మొత్తంలో కొందరు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారని వెలుగు చూడటంతో అలాంటి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు చెక్ పెట్టడానికి కర్ణాటక రవాణా శాఖ అధికారులు రంగం సిద్దం చేశారు.

English summary
IT Hub: Auto drivers are outraged against the RTO officials of Jayanagar in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X