చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT HUB: ఫేమస్ ఆశ్రమంలో స్వామీజీ ముసుగులో యాసిడ్ కేసు నిందితుడి మకాం, పోలీసుల కాల్పుల్లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై/ తిరువణ్ణామలై: యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు అనుకున్నాడు. తనను ప్రేమించాలని ఆమె మీద అతను ఒత్తిడి చేశాడు. బాగా చదువుకున్న యువతి ఉద్యోగం చేస్తున్నది. వెంటపడుతున్న యువకుడిని ప్రేమించడం ఆమెకు ఇష్టం లేదు. తనను ప్రేమించాలని యువకుడు వెంటపడటంతో ఆమె ఇంట్లో విషయం చెప్పడానికి భయపడింది. యువతి పని చేస్తున్న ఆఫీసు దగ్గరకు వెళ్లిన యువకుడు నన్ను ప్రేమిస్తావా లేదా ?, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ? అని ఆమెను ప్రశ్నించాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఆమె తేల్చి చెప్పింది. అంతే వెంటనే ఆమె మీద యాసిడ్ పోసిన నిందితుడు అక్కడి నుంచి పరారైనాడు, రెండు వారాల నుంచి ఐదు రాష్ట్రాల్లో ఆ కిరాతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ప్రముఖ సిటీలోని ఆలయంలో స్వామీజీ వేశంలో తలదాచుకున్న నిందితుడు ఇన్ని రోజులు తప్పించుకున్నాడు. ఓ పాంప్లెట్ సహాయంతో ఓ విద్యార్థి ఆ కిరాతకుడిని గుర్తించి అతన్ని పోలీసులకు పట్టించాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడి మీద పోలీసులు కాల్పులు జరిపారు.

Khiladi wife: భార్యకు ప్రియుడి చీమ కుట్టింది, భర్తను 13 సార్లు కత్తులతో పొడిచి, క్లైమాక్స్ లో భార్య ? !Khiladi wife: భార్యకు ప్రియుడి చీమ కుట్టింది, భర్తను 13 సార్లు కత్తులతో పొడిచి, క్లైమాక్స్ లో భార్య ? !

 యువతి అంటే చాలా ఇష్టం

యువతి అంటే చాలా ఇష్టం

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని కామాక్షిపాళ్యలో 23 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది, యవతి నివాసం ఉంటున్న ఏరియాలోనే నాగేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, యువతికి, నాగేష్ కు వయసులో 9 సంవత్సరాల తేడా ఉందని తెలిసింది, ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతికి, నాగేష్ కు ముందే పరిచయం ఉంది.

 వన్ సైడ్ లవర్

వన్ సైడ్ లవర్

ఆ యువతిని నాగేష్ ప్రేమించాడు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వన్ సైడ్ లవర్ నాగేష్ అనుకున్నాడు. తనను ప్రేమించాలని ఆమె మీద నాగేష్ ఒత్తిడి చేశాడు. ఎంఏ పూర్తి చేసిన యువతి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. వెంటపడుతున్న నాగేష్ ను ప్రేమించడం ఆమెకు ఇష్టం లేదు. తనను ప్రేమించాలని నాగేష్ మాత్రం ఆమె వెంటపడటంతో ఆమె ఇంట్లో విషయం చెప్పడానికి భయపడింది.

 ఆఫీసు ముందే యాసిడ్ పోసిన కిరాతకుడు

ఆఫీసు ముందే యాసిడ్ పోసిన కిరాతకుడు

ఏప్రిల్ 28వ తేదీన ఉదయం యువతిని ఆమె తండ్రి కూతురు ఉద్యోగం చేస్తున్న చోట ఆమెను డ్రాప్ చేశాడు. నన్ను ప్రేమిస్తావా లేదా ?, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ? అని ఆమెను నాగేష్ ప్రశ్నించాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ఆమె నాగేష్ కు తేల్చి చెప్పింది. అంతే వెంటనే ఆమె మీద యాసిడ్ పోసిన నిందితుడు నాగేష్ అక్కడి నుంచి పరారైనాడు, హడలిపోయిన ఆఫీసు సిబ్బంది యువతి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. అప్పటి నుంచి యువతి బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

 ఐదు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు

ఐదు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు

నాగేష్ ను పట్టుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. నాగేష్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు, పరిచయం ఉన్న వాళ్లను పోలీసులు ఇంతకాలం విచారణ చేశారు. యాసిడ్ దాడి కేసులో నాగేష్ ను అరెస్టు చెయ్యలేకపోయారని కర్ణాటకలోని అనేక జిల్లాలకు చెందిన నాయకులు, ప్రజలు బెంగళూరు పోలీసులను విమర్శించారు. బెంగళూరు పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతితో పాటు తమిళనాడు, ధర్మస్థలం, ముంబాయి, వారణాసి, ఆగ్రా, డెహ్రాడూన్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో నాగేష్ ను పట్టుకోవాలని బెంగళూరు పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.

 వాట్సాప్ లో పాంప్లెట్ వైరల్

వాట్సాప్ లో పాంప్లెట్ వైరల్

తమిళనాడులోని తిరువణ్ణామలైలోని రమణశ్రీ ఆశ్రమంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణంలో స్వామీజీ ముసుగులో తలదాచుకున్నాడు. బెంగళూరు పోలీసులు నాగేష్ ఫోటోలతో తిరువణ్ణామలైలో అతికించారు. బెంగళూరులోని ఓ విద్యార్థి ఆ పాంప్లెట్ ను తమిళనాడులోని అతని ఫ్రెండ్స్ కు షేర్ చేశారు వాట్సాప్ లో ఆ పాంప్లెట్ అక్కడా ఇక్కడా తిరిగి తిరువణ్ణామైలో చదువుతున్న ఓ విద్యార్థికి చేరింది. ఆ పాంప్లెట్ చూసిన ఓ విద్యార్థి బెంగళూరులోని అతని ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

 కిరాతకుడి మీద కాల్పులు జరిపిన పోలీసులు

కిరాతకుడి మీద కాల్పులు జరిపిన పోలీసులు

బెంగళూరు పోలీసులు తిరువణ్ణామలై వెళ్లి కిరాతకుడు నాగేష్ ను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతే పోలీసులు నాగేష్ కాలి మీద కాల్పులు జరిపి అతన్ని అరెస్టు చేశారు. యువతి మీద యాసిడ్ దాడి చేసి 17 రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నాగేష్ ను పట్టుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కమల్ పంత్ శనివారం మీడియాకు చెప్పారు.

English summary
IT HUB: Bengaluru Acid Attack Case Accused Nagesh arrested in Tiruvannamalai. He was doing Meditation in the swamiji dress at ashram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X