IT Hub: ఫ్రెండ్ ను చంపేసి శవాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ?, ఏం చేస్తారో చేసుకోండి !
బెంగళూరు: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. బ్యాంక్ లో లోన్ కావాలని ఓ వ్యక్తి అనుకున్నాడు. తాను బ్యాంక్ లో లోన్ తీసిస్తానని ఆయనకు అతని స్నేహితుడు చెప్పాడు. ఇద్దరి మద్య ఆర్థిక లావాదేవీలు చాలాకాలం జరిగాయి. ఈ మద్య చాలా తతంగం జరిగింది. చివరికి ఓ వ్యక్తి లోన్ తీసిస్తాని మోసం చేసిన వ్యక్తిని హత్య చేసి శవంతో సహ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగడూ సమీపంలోని హిమ్మనళ్లికి చెందిన మహేశ్వరప్ప, రాజశేఖర్ కు 13 సంవత్సరాలకు పైగా పరిచయం ఉంది. మహేశ్వరప్ప, రాజశేఖర్ కుటుంబ సభ్యులు స్నేహితులు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు వ్యవసాయ బ్యాంక్ లో లోన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేశారు.

రాజేశేఖర్ కుటుంబ సభ్యలు ప్రస్తుతం బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. రాజశేఖర్ బెంగళూరులోని రామమూర్తి నగర్ లో నివాసం ఉంటున్నాడు. స్నేహితుడు రాజశేఖర్ బ్యాంక్ లో లోన్ తీసుకోవాని ప్రయత్నిస్తున్నాడనే విషయం తెలుసుకున్న మహదేశప్ప స్నేహితుడు రాజశేఖర్ ను కలిసి తాను మీకు బ్యాంక్ లో లోన్ తీసిస్తానని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పాడు.
డబ్బులు తీసుకుని బ్యాంక్ లో లోన్ తీసివ్వకపోవడంతో రాజశేఖర్ అతని స్నేహితుడు మహదేశ్వరప్ప మీద రగిలిపోయాడు. రాజశేఖర్ అతని స్నేహితుడు మహదేశప్పను పట్టుకుని నిలదీశాడు, తరువాత రాజశేఖర్ అతని కారులో మహదేశప్పను పిలుచుకుని బెంగళూరుకు బయలుదేరాడు. మార్గం మద్యలో గొడవ జరగడంతో సహనం కోల్పోయిన రాజశేఖర్ అతని కారులో ఉన్న రాడ్ తీసుకుని అతని ఫ్రెండ్ మహదేశప్పను చంపేశాడు. కారులోనే శవం తీసుకెళ్లి బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ లో రాజశేఖర్ లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications