జయలలిత వైద్యుడి ఇంటిపై ఐటీ దాడులు, శశికళ అక్క కుమార్తె ప్రభా, డాక్టర్ శివకుమార్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ఐటీ శాఖ అధికారులు విసిరిన పంజాకు శశికళ కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. ఒక్క సారిగా 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో ఏం చెయ్యాలో అర్థం కాక మన్నార్ గుడి మాఫియా ముఠా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మోడీ ఎఫెక్ట్: శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఐటీ శాఖ షాక్, బెంగళూరు నుంచి దినకరన్ పరుగో పరుగు!

జయలలితకు వైద్య చికిత్సలు చేసిన డాక్టర్ శివకుమార్ ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తమిళనాడులోని తిరుచ్చిలోని డాక్టర్ శికుమార్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

 IT officials has raided at Dr. Sivakumar house, who has giver treatment to Jayalalitha.

శశికళ సోదరుడి కుమార్తె ప్రభాను డాక్టర్ శివకుమార్ పెళ్లి చేసుకున్నారు. జయలలిత అనారోగ్యానికి గురైన తరువాత ఆమెకు డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స చేశారు. శశికళకు అతి సమీప బంధువు అయిన డాక్టర్ శివకుమార్ ఇంటిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చెయ్యడంతో చిన్నమ్మ అనుచరులు హడలిపోయారు.

శశికళ లిక్కర్ కంపెనీ మిడాస్ లో ఐటీ అధికారులు, దివాకరన్ విచారణ, 187 చోట్లు సోదాలు!

జయలలితకు చెందిన కోడనాడు ఎస్టేట్ ప్రస్తుతం శశికళ కుటుంబ సభ్యుల స్వాధీనంలో ఉంది. జయలలితకు చెందిన కోడనాడు ఎస్టేట్ లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోడనాడు ఎస్టేట్ లో శశికళ భారీ మొత్తంలో అక్రమాస్తుల పత్రాలు, నగదు దాచి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT officials has raided at Dr. Sivakumar house in Tamil Nadu, who has giver treatment to Jayalalitha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి