షాక్: సెక్రటేరియట్ లో ఐటీ దాడులు: వెంట పారామిలటరీ
చెన్నై: జయలలిత మరణించిన తరువాత తమిళనాడు ప్రభుత్వం కుదేలు అవుతున్నది. జయలలిత అత్యంత సన్నిహితుడు అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు దెబ్బతో అక్కడి ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
బుధవారం వేకువ జామున నుంచి తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేసి పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, చిత్తూరులో 44 కేజీల బంగారం, రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం మద్యాహ్నం చెన్నైలోని అన్నా నగర్ లోని రామ్మోహన్ రావు ఇంటి (17/184) నుంచి ఐటీ అధికారులు 8 ప్రత్యేక వాహనాలలో పారామిలటరీ బలగాలను వెంట పెట్టుకుని నేరుగా సెక్రటేరియట్ చేరుకున్నారు.

సెక్రటేరియట్ లోని రామ్మోహన్ రావు కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. రామ్మోహన్ రావు దెబ్బతో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఉలిక్కిపడింది. ప్రభుత్వానికి చెందిన సెక్రటేరియట్ లో ఇంత వరకు ఐటీ అధికారులు దాడులు చేసినట్లు చరిత్రలోనే లేదని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.
ఐటీ అధికారులు సెక్రటేరియట్ కు వెళ్లిన సమయంలో కొందరు మంత్రులు మాత్రం అక్కడ ఉన్నారని, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం అక్కడ లేరని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సెక్రటేరియట్ లోని రామ్మోహన్ రావు కార్యాలయంతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉంటున్న అధికారుల కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications