Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయ సన్నిహితుడి డైరీ సీజ్: మంత్రులు పరుగో పరుగు !

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు దగ్గర ఉన్న డైరీ, ల్యాప్ టాప్ తదితర పత్రాలను ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసలు గుట్టు ఉందని ఐటీ అధికారులు అంటున్నారు.

అంతే కాకుండా ఇప్పటికే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి దగ్గర డైరీ స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావు, శేఖర్ రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న డైరీలలో నలుగురు సీనియర్ మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎప్పుడెప్పుడు కలిసింది, ఏం చేసింది అనే పూర్తి వివరాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.

రామ్మోహన్ రావుతో కలిసి పని చేస్తున్న అధికారుల పేర్లు, వివరాలు డైరీలో ఉండటం సహజమే. అయితే అధికార పార్టీ నాయకులతో ఎప్పుడెప్పుడు మాట్లాడింది, ఆ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరెవరు అక్కడ ఉన్నారు ? అనే వివరాలు ఉన్నాయని తెలిసింది.

IT officials said Sekar Reddy was in regular touch with Ram mohan Rao

ఈ వివరాలు సేకరించిన ఐటీ అధికారులు రామ్మోహన్ రావు, అధికార పార్టీ నాయకులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల మొబైల్ ఫోన్ సంభాషణల వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో శేఖర్ రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న డైరీలో నలుగురు మంత్రుల బండారం బయటపడిందని తెలిసింది.

నలుగురు మంత్రులు, ఒక ఏడీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి, 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు శేఖర్ రెడ్డి అవినీతి భాగోతంలో భాగస్వామ్యం ఉందని స్పష్టం అయ్యిందని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.

నలుగురు మంత్రులు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసి నల్లకుబేరులతో కలిసి స్టార్ హోటళ్లలో విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. ఇప్పుడు రామ్మోహన్ రావు, శేఖర్ రెడ్డి దగ్గర ఉన్న డైరీలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో వారు హడలిపోతున్నారు.

రామ్మోహన్ రావుతో పాటు శేఖర్ రెడ్డితో నిత్యం టచ్ లో ఉంటూ బ్లాక్ మనీ దందాకు సహకరించారని వెలుగు చూసింది. వీరిద్దరితో సన్నిహిత సంబంధాలు ఉన్న అన్నాడీఎంకే నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు హడలిపోతున్నారు. ఎప్పుడు ఐటీ అధికారులు దాడి చేస్తారో అని హడలిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+