శశికళ న్యాయవాది కార్యాలయం సీజ్, బినామి, రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం!

Posted By:
Subscribe to Oneindia Telugu
IT raids at Sasikala's Associates Continues | oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళకు ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. శశికళ వ్యవహారాలు పూర్తిగా తెలిసి, ఆమె కేసులు అన్నీ వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సెంథిల్ కార్యాలయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.

శ్రీని వెడ్స్ మహి పేరుతో శశికళ ఫ్యామిలీకి ఝలక్, ఆ జంట ఎవరు, ఒకటే చర్చ, పక్కా ప్లాన్!

తమిళనాడులోని నమ్మక్కల్ కు చెందిన సెంథిల్ బాలాజీ శశికళ అక్రమ వ్యాపారాలకు సహకరించడమే కాకుండా ఆమె బినామిగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. శశికళ ఫ్యామిలీకి సంబంధించిన కేసులు అన్నీ న్యాయవాది సెంథిల్ నేతృత్వంలోనే వాదనలు జరుగుతున్నాయి.

 IT officials sealed Sasikala's advocate Senthil's office room in Namakkal

శశికళ ఫ్యామిలీ మీద పంజా విసిరిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమె బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నమ్మక్కల్ లోని శశికళ న్యాయవాది సెంథిల్ కార్యాలయం, ఇంటిలో గత మూడు రోజుల నుంచి సోదాలు చేస్తున్నారు.

ఐటీ దాడులు అడ్డుకున్న శశికళ మద్దతుదారులు, అరెస్టు, మన్నార్ గుడి కాలేజ్ లో సోదాలు!

శనివారం న్యాయవాది సెంథిల్ కార్యాలయంలో సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు రికార్డులు పరిశీలించి రూ. కోట్ల విలువైన అక్రమాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ పరిశీలించిన రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాల విషయంలో న్యాయవాది సెంథిల్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన కార్యాలయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Income Tax officials sealed Sasikala's advocate Senthil's office room in Namakkal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి