నిన్న బిర్యానీలు, నేడు బంగారు నగల షోరూమ్ లు, చుక్కలు చూపించిన ఐటీ శాఖ, లెక్కల్లో!
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు (bengaluru) నగరంలో ఆదాయపన్ను శాఖ (IT Raids) అధికారులు పంజా విసిరారు. ఒకదానికి ఒకటి సంబందం లేకుండా రెండు రకాల వ్యాపారాలు చేస్తున్న వారికి ఐటీ శాఖ అధికారులు చుక్కలు చూపించారు. భారీ మొత్తంలో డబ్బు సంపాధిస్తున్నా ఆదాయపన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వ్యాపారులకు ఐటీ శాఖ (IT raids)అధికారులు చుక్కలు చూపించారు.
బెంగళూరు (bengaluru) నగరంలోని బంగారు నగల (jewelery) వ్యాపారులు కొందరు ఆదాయపన్నుఎగవేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం, కోరమంగల, సదాశివనగర, సర్జాపుర రోడ్డు, మత్తికెరె తదితర ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు పలువురు బంగారు (gold) నగల వ్యాపారుల లావాదేవీలు పరిశీలించారు.

బెంగళూరు (bengaluru) నగరంలో 15 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చెయ్యడంతో బంగారు (gold) నగల వ్యాపారలు ఉలిక్కపడ్డారు, జ్యువెలరీ షోరూమ్ లతో పాటు వాటి యజమానుల ఇళ్లల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. అయితే సోదాలు ఇంకా పూర్తికాలేదని ఐటీ శాఖ (IT raids) అధికారులు అంటున్నారు. బంగారు (gold)నగల వ్యాపారుల వివరాలు, సోదాలకు సంబంధించిన వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరించారని కన్నడ మీడియా తెలిపింది.
బెంగళూరు (bengaluru) నగర శివార్లలో బిర్యానీలకు పుట్టినిళ్లు అయిన హోసకోటేలో (బెంగళూరు-తిరుపతి (Tirupati) హైవే రోడ్డు) ఐటీ శాఖ అధికారులు పంజా విసిరారు. బిర్యానీ (biryani) హోటల్ వ్యాపారాల్లో ప్రతిరోజు లక్షల్లో లాభాలు సంపాధిస్తున్న వ్యాపారులు ఆదాయపన్ను ఎగవేస్తున్నారని సమాచారం అందడంతో ఐటీ శాఖ (IT raids) అధికారులు నిఘా వేశారు. పక్కా సమాచారం సేకరించిన అధికారులు పలు హోటల్స్ లో సోదాలు ముమ్మరం చేసి బిల్లింగ్ మిషన్లు పరిశీలిస్తున్నారు.
బెంగళూరు (bengaluru) సిటీకి కూతవేటు దూరంలో ఉన్న హోస్ కోటే (బెంగళూరు గ్రామీణ జిల్లా)లో ప్రతినిత్యం వేకువ జామున 4 గంటలకు వేడివేడి మటన్ బిర్యానీల (biryani) విక్రయాల మొదలు అవుతాయి. రూ 240 నుంచి రూ 300 వరకు ఒక్కొ మటన్ బిర్యానీ విక్రయిస్తారు. ఒక్కొక్క హోటల్ లో ప్రతిరోజు వెయ్యి నుంచి రెండు వేల బిర్యానీలు (biryani) విక్రయిస్తుంటారు. బెంగళూరు (bengaluru) నుంచి జాలీరైడ్ కు వెళ్లడానికి ఇష్టపడుతున్న యువతి, యువకలుు వీకెండ్ లో భారీ సంఖ్యలో హోస్ కోటేలో వేకువ జామున వేడివేడి బిర్యానీలు (biryani) తింటున్నారు.












Click it and Unblock the Notifications