బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady leader: మాజీ ఎమ్మెల్సీకి షాక్ ఇచ్చిన ఐటీ శాఖ, అల్లుడు, పనివాళ్లను వదల్లేదు, ఎన్నికల టైమ్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిక్కమగళూరు: కర్ణాటకలో కొన్ని నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎంకు సన్నిహితురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలికి ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. లేడీ లీడర్ తో పాటు ఆమె అల్లుడు ఇల్లు, కార్యాలయాలు, లేడీ లీడర్ ఇంటిలో, వాళ్ల తోటల్లో పని చేస్తున్న పనివాళ్ల ఐళ్లల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వానికి చెప్పి లేడీ లీడర్ ఇంటి మీదకు ఐటీ శాఖ అధికారులను పంపించారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Girlfriend: ప్రియురాలు ఇస్లాం మతం స్వీకరించలేదని ?, అపార్ట్ మెంట్ పైనుంచి తోసేసిన శాడిస్టు !Girlfriend: ప్రియురాలు ఇస్లాం మతం స్వీకరించలేదని ?, అపార్ట్ మెంట్ పైనుంచి తోసేసిన శాడిస్టు !

కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన గాయిత్రీ శాంతేగౌడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితులలో ఒకరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్న గాయిత్రీ శాంతేగౌడకు గురువారం ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు.

అల్లుడు, పనివాళ్లను వదల్లేదు

అల్లుడు, పనివాళ్లను వదల్లేదు

చిక్కమగళూరులోని గాయిత్రీ శాంతేగౌడ ఇంటిలో గురువారం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేడీ లీడర్ గాయిత్రీ శాంతేగౌడ ఇంటితో పాటు ఆమెకు చెందిన క్రషర్ ఉన్న గ్రామంలో, గాయిత్రీ శాంతేగౌడ అల్లుడు నివాసం ఉంటున్న హాసన్ జిల్లలోని బేలూరులోని ఇంటిలో, కార్యాలయాలు, లేడీ లీడర్ ఇంటిలో, వాళ్ల తోటల్లో పని చేస్తున్న పనివాళ్ల ఐళ్లల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయిన లేడీ లీడర్

కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయిన లేడీ లీడర్

మాజీ ఎమ్మెల్సీ గాయిత్రీ శాంతేగౌడ గత విధాన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సందర్బంలో బీజేపీ అభ్యర్థి ప్రాణేష్ చేతిలో కేవలం 6 ఓట్ల తేడాతో గాయిత్రీ శాంతేగౌడ ఓడిపోయారు. కొన్ని నెలల్లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో చిక్కమగళూరు నుంచి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి మీద పోటీ చెయ్యడానికి గాయిత్రీ శాంతేగౌడ ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.

మండిపడిన కాంగ్రెస్ నాయకులు

మండిపడిన కాంగ్రెస్ నాయకులు

గాయిత్రీ శాంతేగౌడ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న చిక్కమగళూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె ఇంటి దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వానికి చెప్పి లేడీ లీడర్ ఇంటి మీదకు ఐటీ శాఖ అధికారులను పంపించారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిక్కమగళూరు పోలీసులు గాయిత్రీ శాంతేగౌడ ఇంటి దగ్గర గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
IT Raid on Congress prarty Karnataka leader and Former MLC Gayathri shanthe gowda house at Chikkamagaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X