ఎవరీ పూంగుండ్రన్?: శశికళ కుటుంబాన్ని ఐటీ టార్గెట్ చేయడం వెనుక.., మొత్తం చెప్పేశాడు!
పూంగుండ్రన్ అందించిన కీలక సమాచారంతోనే ఐటీ అధికారులు జయలలిత నివాసం వేద నిలయంపై రాత్రిపూట దాడులు చేశారు.
Recommended Video

చెన్నై: అన్నాడీఎంకె మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబంపై ఐటీ దాడుల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది. ఏకకాలంలో 200 ప్రాంతాల్లో దాడులు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.
తాజా ఐటీ దాడుల్లో దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించిన అధికారులు మరోమారు దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. శశికళ ఆస్తులకు పెద్ద ఎత్తున బినామీలు ఉన్నారని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
పోయెస్ గార్డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్‌లు, పెన్ డ్రైవ్‌ల ద్వారా అధికారులు మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ దాడుల వెనుక ఐటీ అధికారులకు సహకరించిందెవరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పూంగుండ్రన్:
ఐటీ దాడుల వెనుక ఎవరున్నారన్న ప్రశ్నకు.. జయలలిత సహాయకుడు 'పూంగుండ్రన్' పేరే సమాధానంగా వినిపిస్తోంది. ఏళ్లుగా జయలలితకు నమ్మినబంటుగా ఉన్న పూంగుండ్రన్ కు మాత్రమే పోయెస్ గార్డెన్ తో పాటు జయలలిత, శశికళ ఆస్తుల వివరాలు తెలుసునని అంటున్నారు.
అన్నాడీఎంకెలో జయలలిత ప్రభ పెరుగుతూ వచ్చినప్పటి నుంచి పూంగుండ్రన్ ఆమె సహాయకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాగా, జయలలిత రాజకీయ ఆరంగేట్రం చేసిన తొలినాళ్లలో పూంగుండ్రన్ తండ్రి శంకరలింగం ఆమెకు ప్రసంగ పాఠాలు తయారుచేసి ఇచ్చేవారు.

పోయెస్ గార్డెన్‌లో పూంగుండ్రన్ హవా:
జయలలిత సహాయకుడిగా పూంగుండ్రన్ పోయెస్ గార్డెన్ లో తన హవా కొనసాగించారు. ఫోన్ చేసేది ఎంతటివారైనా సరే.. ముందు పూంగుండ్రన్ తో విషయం చెబితేనే.. ఆ తర్వాత జయలలిత వారితో మాట్లాడుతారు. జయలలిత పార్టీ వ్యవహారాలతో పాటు, ఆమె వ్యక్తిగత ఆస్తుల విషయాలను పూంగుండ్రన్ చాలా దగ్గరిగా పరిశీలించాడు. చాలాసార్లు చాలా వ్యవహారాలు చక్కదిద్దాడు.

శశికళ-పూంగుండ్రన్:
అయితే పోయెస్ గార్డెన్ లోకి జయలలిత నెచ్చెలి శశికళ ఎంట్రీతో పూంగుండ్రన్ పట్టు కాస్త సడలింది. 2011లో శశికళను జయలలిత ఇంటి నుంచి గెంటివేయడంతో పూంగుండ్రన్ ప్రాభవం మళ్లీ మొదలైంది. అప్పటిదాకా శశికళ పేరు మీద ఉన్న కొన్ని బినామీ ఆస్తులు పూంగుండ్రన్ పేరు మీదకు మారినట్టు చెబుతారు. ఆ తర్వాత జయలలిత కాళ్లా వేళ్లా పడి మళ్లీ వేద నిలయంలోకి చేరిన శశికళ.. ఈసారి పూంగుండ్రన్ తో సంధి చేసుకుని అతనితో కలిసిపోయారు.

పూంగుండ్రన్‌ను పట్టుకోవడంతో:
శశికళ జైల్లో శిక్ష అనుభవిస్తుండటంతో.. ఆమె ఆస్తుల లెక్క తేల్చడానికి ఇదే సరైన సమయమని ఐటీ అధికారులు భావించారు. ఇందుకోసం గత మూడు నెలలుగా పక్కా ప్రణాళిక రూపొందిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఎవరిని పట్టుకుంటే వివరాలన్ని బయటపడుతాయో అన్నది ఆరా తీశారు. ఈ క్రమంలో పూంగుండ్రన్ పేరే వారికి ప్రధానంగా కనిపించింది.
అనుకున్నట్టుగానే అన్నాడీఎంకే పార్టీ పత్రిక నమదు ఎంజీఆర్ పబ్లిషర్‌గా ఉన్న పూంగుండ్రన్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆస్తుల వివరాలన్ని బయటపడ్డాయి. ఆ ఆధారాలతోనే ఏకకాలంలో ఐటీ అధికారులు 200ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

మరోసారి దాడులకు సిద్దం
పూంగుండ్రన్ అందించిన కీలక సమాచారంతోనే ఐటీ అధికారులు జయలలిత నివాసం వేద నిలయంపై రాత్రిపూట దాడులు చేశారు. వేదనిలయంలోని పూంగుండ్రన్ గది, శశికళ గదుల్లో సోదాలు నిర్వహించారు.
దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ కేంద్రంగా జరిగిన ఆస్తుల కొనుగోళ్లు, పంపకాలు, బినామీలు, బినామీ కంపెనీల వ్యవహారాలు వంటి విషయాలన్ని పూంగుండ్రన్ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా మరో రెండు, మూడు రోజుల్లో వేద నిలయంలో మరోమారు ఐటీ అధికారులు దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి జయలలిత గదుల్లో వారి తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications