బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళకు తిండి లేదు, నిద్ర అసలే లేదు, చేదు వార్త, ఆందోళన!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఎప్పుడు ఏ చేదువార్త వినాల్సి వస్తోందో అంటూ ఆవేదన చెందుతున్నారని వెలుగు చూసింది. గత మూడు రోజుల నుంచి శశికళకు నిద్ర పట్టడంలేదని సమాచారం.

ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!

రెండు రోజులుగా సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదని తెలిసింది. షుగర్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న శశికళను ఆహారం తీసుకోవాలని ఆమె వదిన ఇళవరసి సర్ది చెబుతున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయినా శశికళ వదిన ఇళరవసి మాట వినడం లేదని సమాచారం.

IT raids in Chennai on various assets connected with VK Sasikala

అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త నటరాజన్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం శశికళకు తెలిసింది. అనారోగ్యంతో ఉన్న తన భర్త నటరాజ్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు వేధింపులకు గురి చేస్తే ఆయనకు ఏమైనా జరిగితే ఏంచెయ్యాలి అంటూ శశికళ ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

పెళ్లికి వెళ్లాలని ట్యాక్సీలు బుక్ చేసి ఐటీ శాఖ దాడులు, శశికళ ఫ్యామిలీకి మేలు జరుగుతుంది!

ఎక్కడ శశికళను కలిస్తే మా ఇంటి మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తారో అంటూ ఆమె వర్గీయులు సైతం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వైపు రెండు రోజులుగా కన్తెత్తి చూడటం లేదని సమాచారం. మొత్తం మీద మా కుటుంబ సభ్యుల ఆస్తులు ఎక్కడ సీజ్ చేస్తారో అంటూ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ ఆందోళన చెందుతున్నారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Income Tax raid in Chennai on various assets connected with VK Sasikala Natarajan, AIADMK leader who is in bengaluru's Parappana Agrahara Jail continuous today also. Accurate information about the total wealth siezed by IT officials has not known yet.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి