Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం సిద్దరామయ్య పోటీ, బాదామిలో ఐటీ దాడులు, రిసార్టులో సోదాలు, ఎమ్మెల్సీ, బళ్లారి శ్రీరాములు !

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల సందర్బంగా ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు నిఘా వేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటీ చేస్తున్న బాదామి శాసన సభ నియోజక వర్గంపై నిఘా వేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు అర్దరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా దాడులు చేసి సోదాలు చేశారు. బాదామిలో సీఎం సిద్దరామయ్య మీద బళ్లారి ఎంపీ శ్రీరాములు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

    కర్ణాటక ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్దుల ఆస్తుల వివరాలు తెలుసా??
    ఎమ్మెల్మే రిసార్టు

    ఎమ్మెల్మే రిసార్టు

    బళ్లారి జిల్లా విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా పని చేసిన ఆనంద్ సింగ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆనంద్ సింగ్ కు బాదామి శివార్లలో ఖరీదైన రిసార్టు ఉంది.

    కృష్ణ హెరిటేజ్

    కృష్ణ హెరిటేజ్

    విజయనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేస్తున్న ఆనంద్ సింగ్ కు బాదామి శివార్లలో కృష్ణ హెరిటేజ్ అనే రిసార్టు ఉంది. సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక్కసారిగా రిసార్టులో దాడులు చేశారు.

    సీఎం సిద్దూ సన్నిహితుడు

    సీఎం సిద్దూ సన్నిహితుడు

    కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం అక్కడే ఉన్నారని తెలిసింది. మూడు గంటల పాటు సీఎం ఇబ్రహీం కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో ఉన్న సమయంలోనే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

    వేకువ జామున

    వేకువ జామున

    ఆదాయపన్ను శాఖ అధికారులు కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో క్షుణ్ణంగా పరిశీలించి వివిధ పత్రాలు పరిశీలించారని తెలిసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం మంగళవారం వేకువజామున రిసార్టు నుంచి బయటకు వెళ్లిపోయారు.

    సీఆర్ పీఎఫ్ బందోబస్తు

    సీఆర్ పీఎఫ్ బందోబస్తు

    కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన సమయంలో సీఆర్ పీఎఫ్, బాదామి పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. 10 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో సోదాలు చేశారు. సీఎం సిద్దరామయ్యను ఎలాగైనా గెలిపించాలని భారీ మొత్తంలో కృష్ణ హెరిటేజ్ రిసార్టు లో నగదు దాచిపెట్టారని సమాచారం అందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+