Jharkhand IT raids : జార్ఖండ్ కాంగ్రెస్ పై ఐటీ పంజా-ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లలో రూ.100 కోట్లు సీజ్

జార్ఖండ్ లో సీఎం హేమంత్ సోరెన్ పై మనీలాండరింగ్ కేసు చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే కేంద్రం ఐటీ సాయంతో జేఎంఎం మిత్రపక్షం కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది. జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు రూ.100కోట్ల నగదును సీజ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నా సోరెన్ పై సుప్రీం తీర్పు తర్వాత దూకుడు మరింతపెరిగింది. రాష్ట్రంలో ఇద్దరు జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, వారి సహచరులు, అనుబంధిత బొగ్గు, ఇనుప ఖనిజం వ్యాపారాలపై దాడులు జరిపిన ఆదాయపు పన్ను శాఖ రూ.100 కోట్లకు పైగా లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించింది. జార్ఖండ్‌లోని రాంచీ, గొడ్డా, బెర్మో, దుమ్కా, జంషెడ్‌పూర్, చైబాసా, పాట్నా (బీహార్), గురుగ్రామ్ (హర్యానా), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)లలో నవంబర్‌లో ప్రారంభించిన సోదాల్లో 50 ప్రాంగణాలను కవర్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ తాజాగా ప్రకటించింది.

it raids on two jharkhand congress mlas-rs.100 cr unaccounted cash seized

జార్ఖండ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమార్ జైమంగల్ అలియాస్ అనూప్ సింగ్, ప్రదీప్ యాదవ్‌ ఇళ్లపై జరిపిన దాడుల్లో భారీ ఎత్తున లావాదేవీల్ని అధికారులు గుర్తించారు. జైమంగల్ బెర్మో ఎమ్మెల్యేకాగా.. ప్రదీప్ యాదవ్.. జేవీఎం-పీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే. ఆయన పోరియాహత్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొగ్గుతో పాటు సహజవనరులు ఎక్కువగా ఉండే జార్ఖండ్ లో సహజంగానే ఇక్కడి రాజకీయ నేతలు వాటి వ్యాపారాల్లోనే చురుగ్గా ఉన్నారు. దీన్ని గుర్తించి ఐటీ అధికారులు వాటిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+