శశికళ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం 1, 430 కోట్లు, ఐటీ అదుపులో మేనల్లుడు వివేక్, ఏం మాయ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇంత కాలం ప్రజల ఆస్తులు బలవంతంగా లాక్కొన్న శశికళ కుటుంబ సభ్యుల పని ఇక ముగిసినట్లే అని తెలిసింది. శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నుంచి లెక్కలు చూపని రూ. 1, 430 కోట్ల అక్రమాస్తులు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.

బెంగళూరు సెంట్రల్ జైల్లో టీవీకి అతుక్కుపోయిన శశికళ, కంటి మీద కునుకులేండా చేశారు !

నవంబర్ 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు 187 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఐటీ శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులకు చెందిన రూ. వేల కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించి విచారణ ముమ్మరం చేశారు. 18 కంపెనీల్లో లెక్కలు చూపని రూ. 1, 430 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన అధికారులు ఇప్పుడు విచారణ ముమ్మరం చేశారు.

ఆపరేషన్ క్లీన్ మనీ

ఆపరేషన్ క్లీన్ మనీ

శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, ఆమె సన్నిహితులను లక్షంగా చేసుకుని ఆదాయపన్ను శాఖ అధికారులు ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట ఈనెల 9వ తేదీ నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో భారీ స్థాయిలో 187 చోట్లు సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల నగదు, రూ. 5 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.

 టార్గెట్ జాజ్ సినిమాస్ !

టార్గెట్ జాజ్ సినిమాస్ !

చెన్నై నగర శివారులోని ఫినిక్స్ మాల్ లోని 11 స్క్రీన్ల జాజ్ సినిమాస్ థియేటర్లు, జయ టీవీని లక్షంగా చేసుకుని ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని సోదాలు ముమ్మరం చేశారు.

 అబ్బా ఏం తెలివితేటలు !

అబ్బా ఏం తెలివితేటలు !

తనకు చెందిన లక్స్ థియేటర్ లోని ప్రొజెక్టర్, ఫర్నీచర్, ఎయిర్ కండిషన్లు తాకట్టు పెట్టడంతో వచ్చిన రూ. 42. 50 కోట్లతో జాజ్ సినిమాస్ ను లీజుకు తీసుకున్నానని చెబుతున్న శశికళ మేనల్లుడు వివేక్ ఐటీ శాఖ అధికారులకే టోపీ పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. 27 ఏళ్ల వయస్సులోనే మాయమాటలు చెబుతున్న వివేక్ ను చూసి ఐటీ శాఖ అధికారులు షాక్ కు గురైనారు.

 ఐటీ అదుపులో శశికళ మేనల్లుడు !

ఐటీ అదుపులో శశికళ మేనల్లుడు !

శశికళ మేనల్లుడు వివేక్ ఇంటిలో 18 బినామీ కంపెనీలకు చెందిన పత్రాలు, అక్రమాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తుల వివరాలు తెలుసుకోవడానికి వివేక్ ను నుంగంబాక్కంలోని ఆదాయపన్ను శాఖ కార్యాయాలనికి పిలుచుకుని వెళ్లిన అధికారులు అతన్ని మంగవారం విచారణ చేస్తున్నారు.

 జయలలిత ఎస్టేట్ లో రూ. కోట్లలో పాత నోట్లు !

జయలలిత ఎస్టేట్ లో రూ. కోట్లలో పాత నోట్లు !

జయలలితకు చెందిన నీలగిరిలోని కొడనాడు గ్రీన్ టీ ఎస్టేట్ ప్రస్తుతం శశికళ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. కొడనాడు గ్రీన్ టీ ఎస్టేట్ లో భారీ మొత్తంలో రద్దు అయిన రూ. 1, 000, రూ. 500 నోట్లు, మూడు కేజీల బంగారం గుర్తించిన ఐటీ శాఖ అధికారులు వాటిని సీజ్ చేసి విచారణ మమ్మరం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Income Tax Department has unearthed tax evasion of Rs 1,430 crore during its raids/searches spread over five days at the premises of jailed AIADMK leader V.K. Sasikala's kin and their business associates, an official said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి