అత్యధిక వేతనాలు ఐటీ ఉద్యోగులకే... గంటకు రూ. 341.8
న్యూఢిల్లీ: మన దేశంలో అత్యధిక వేతనాలు ఐటీ ఉద్యోగులే తీసుకుంటున్నారు. ఒక సర్వే తెలిపిన ప్రకారం అత్యధికంగా ఐటీ ఉద్యోగులు గంటకు రూ. 341.8 వేతనం ఆర్జిస్తున్నారు. ఆ తర్వాతి స్ధానంలో ఆర్ధిక విభాగం (ఫైనాన్స్)లో పనిచేస్తున్న ఉద్యోగులు గంటకు రూ. 291 ఆర్జిస్తున్నారు.
ఆన్‌లైన్ కెరీర్, నియామక పరిష్కారాల్లో అగ్రగామిగా ఉన్న మాన్ స్టర్ ఇండియా ఓ నివేదకను విడుదల చేసింది. మాన్‌స్టర్ శాలరీ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం ఐటీ, ఫైనాన్స్ ఉద్యోగులు మొదటి రెండు స్ధానాల్లో నిలిచారు. విద్యా విభాగం ఉద్యోగులు రూ. 186.5 ఆర్జిస్తున్నారు.

వేరే విభాగాలతో సరిపోల్చి చూస్తే ఎక్కువ సమయం విద్యా విభాగం వారు పనిచేస్తున్నప్పటికీ... వేతనాల విషయంలో 18 శాతం తక్కువగా పొందుతున్నారని నివేదికలో పేర్కొంది. ఆరోగ్య విభాగం ఉద్యోగులు రూ. 215, లీగల్ విభాగం ఉద్యోగులు రూ. 215.6 వేతనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆ సర్వే పేర్కొంది.
భారత్‌లో ఆడవారు, మగవారికి చెల్లించే వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంది. ఐటీ రంగంలో మగవారితో పోలిస్తే ఆడవారు 34 శాతం తక్కువగా పొందుతున్నారని తేల్చింది. ఐతే ఇటీవల కాలంలో ఐటీ రంగంలో అత్యున్నత స్ధాయినియామకాల్లో మహిళల శాతం భారీగా పెరిగిందని పేర్కొంది.












Click it and Unblock the Notifications