Maharashtra assembly election 2024: సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య వాగ్వాదం..!!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అధికార కూటమిలో అసమ్మతి పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. సీఎం షిండే అనేక ప్రధాన ప్రకటనలను ప్రతిపాదించడంతో విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే పవార్ చేసిన ప్రతిపాదనలను షిండే వ్యతిరేకించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిందని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల తీసుకురావాలని మంత్రివర్గం భావిస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఓటర్ల ఆదరణ పొందేందుకు వివిధ పథకాలను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుపుతోంది. అయితే గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రతిపాదనకు పవార్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనట్లు చెబుతున్నారు.

ఆ తర్వాత సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అజిత్ బయటకు వెళ్లడంతో సమావేశంలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారని స్థానిక మీడియా పేర్కొంది. పవార్‌ల కుటుంబం కీలకంగా భావించే బారామతికి సంబంధించి షిండే తీసుకొచ్చిన ప్రతిపాదనలు పవార్ తీవ్ర వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కేబినేట్ సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలలోపే తాను బయటకు రాలేదని అజిత్ పవార్ చెప్పారు. లాతూర్‌లోని ఉద్గీర్ నియోజకవర్గంలో తాను సమావేశాలు షెడ్యూల్ చేసినందున షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల అనుమతితోనే బయటకు వచ్చినట్లు వివరించారు.
"నాకు మధ్యాహ్నం 1 గంటలకు విమానం ఉంది. అందుకే నేను మీటింగ్ నుంచి బయటకు వచ్చాను" అజిత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో తనకున్న విభేదాల గురించిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు.












Click it and Unblock the Notifications