Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Its fake: నోబెల్ శాంతి బహుమతి రేసులో మోదీ- అంతా ఉత్తిదే: కొట్టిపారేసిన నోబెల్ కమిటీ..!!

ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారంటూ వచ్చిన వార్తలను నోబెల్ కమిటీ కొట్టిపారేసింది. అవన్నీ ఫేక్ న్యూస్ కమిటీ ఉప నేత ఆష్లే టోజె వెల్లడించారు.

న్యూఢిల్లీ: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీదారుగా ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా ఆయన ఎంతో కృషి చేశారని, దీన్ని గుర్తిస్తూ ఆయనకు నోబెల్ బహుమతిని అందజేసే అవకాశాలు లేకపోలేదంటూ స్వయానా ఆ కమిటీ డిప్యూటీ లీడర్ ఆష్లే టోజే ప్రకటించారనేది ఆ వార్తల సారాంశం. మోదీ- శాంతి బహుమతిని అందుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధాన్ని నిలువరించడానికి మోదీ కృషి చేశారని, దీనికోసం ఆయన ఆ రెండు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, వొలొదిమిర్ జెలెన్‌స్కీతో పలుమార్లు ఫోన్ లో సంభాషించారంటూ వార్తలొచ్చాయి. ఈ కృషిని నోబెల్ కమిటీ గుర్తించిందని, ఇక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి అందుతుందంటూ అటు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపించాయి.

Its fake, Nobel Committees Asle Toje says on PM Modi a strong contender for the Nobel peace Prize

వాటన్నింటిపైనా నోబెల్ కమిటీ స్పందించింది. ఆ వార్తలన్నీ నకిలీవని కొట్టిపారేసింది. దీనిపై ఆష్లే టోజే స్వయంగా దీనిపై మాట్లాడారు. తాను చెప్పిందొకటి.. బయట ప్రచారంలోకి వచ్చిందొకటని తేల్చి చెప్పారు. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ పోటీదారుగా ఉన్నారంటూ వచ్చిన వార్తలు ఏమాత్రం వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన ఓ ట్వీట్- తప్పుడు సందేశాన్ని పంపించిందని వ్యాఖ్యానించారు.

తాను నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్‌ హోదాలో భారత్ లో పర్యటించట్లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్‌స్టాండింగ్ కమిటీ డైరెక్టర్ గా మాత్రమే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. భారత్ కు ఓ అత్యంత సన్నిహితుడిగా ఉంటోన్నానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప- ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ గట్టి పోటీదారుగా ఉన్నారని తాను చెప్పానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పారు.

Its fake, Nobel Committees Asle Toje says on PM Modi a strong contender for the Nobel peace Prize

యుద్ధాలు చేయడానికి ఇది తగిన సమయం కాదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ఆయన ఉటంకించారు. ఆ ప్రకటనను తాను స్వాగతిస్తోన్నానని వ్యాఖ్యానించారు. యుద్ధాల ద్వారా కాకుండా చర్చలు, శాంతియుత వాతావరణం మధ్య వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాలను భారత్ పంపించిందని గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషాదకర ఘటనగా అభివర్ణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+