చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ సమాధి వద్ద‘తలనీలాలు సమర్పించి’మంత్రుల శపథం

తమిళనాడు సీనియర్ మంత్రులు ఉదయ్ కుమార్, సేవూర్ రామచంద్రన్ తదితరులు జయలలిత మహాసమాధి వద్ద నివాళులు అర్పించి తలనీలాలు సమర్పించుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించిన పలువురు మంత్రులు ఆమె సమాధి దగ్గర తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. చెన్నైలోని మెరినా బీచ్ లోని జయలలిత మహాసమాధి వద్ద తమిళనాడు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ఆమె అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

తమిళనాడు సీనియర్ మంత్రులు ఉదయ్ కుమార్, సేవూర్ రామచంద్రన్ తదితరులు జయలలిత మహాసమాధి వద్ద నివాళులు అర్పించి తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదే సమయంలో ప్రజల కోసం మీరు చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తామని అక్కడ శపథం చేశారు.

J Jayalalithaa’s statue at memorial creates excitement in Chennai

ఇదే సమయంలో ఆంధ్రపద్రేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించిన జయలిత ఫైబర్ విగ్రహం మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గర ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కార్యదర్శి ముత్తుకుమార్ జయలలిత ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి మెరినా బీచ్ లో ఏర్పాటు చేశారు.

తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు వందలాధి మంది అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు మెరినా బీచ్ దగ్గరకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. వర్దా తాండవం చల్లారిన తరువాత మెరినా బీచ్ లో జయలలితకు నివాళులు అర్పించడానికి అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో అక్కడ రద్దీ ఎక్కువ అయ్యింది.

English summary
Tamil Nadu State Ministers R.B. Udayakumar (Revenue) and Sevoor S. Ramachandran accompanied by party followers arrived at the site and paid homage to Jayalalithaa's portrait after tonsuring their heads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X