మళ్లీ తెగబడిన ఉగ్రవాదులు: ముగ్గురు జవాన్లు, మహిళ మృతి
జమ్మూకాశ్మీలో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గురువారం తెల్లవారుజామున దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాలో సైనిక గస్తీబృందంపై దాడి చేశారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీలో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. గురువారం తెల్లవారుజామున దక్షిణ కశ్మీర్ షోపియన్ జిల్లాలో సైనిక గస్తీబృందంపై దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఇంట్లో ఉన్న ఒక స్థానిక మహిళ కూడా మృతి చెందింది.

షోపియన్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తున్న బృందంపై మాత్రిగామ్ వద్ద దాడి జరిగింది. ఉగ్రవాదులు భారీ తుపాకులతో తెల్లవారుజామున 2.30 సమయంలో దాడికి దిగారు. అనంతరం చీకటిని ఆసరగా చేసుకొని వారు పారిపోయారు. వారం రోజుల్లో నాలుగో భారీ ఉగ్రదాడి కావడం గమనార్హం.
కాగా, రెండ్రోజుల క్రితం రాత్రిపూట సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులతో తీవ్రంగా పోరాడిన భారత జవాన్లు.. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. దీంతో అక్కడ్నుంచి మిగితా ఉగ్రవాదులు పరారయ్యారు.












Click it and Unblock the Notifications