ట్విట్టర్ ధిక్కారం: జమ్ముకశ్మీర్, లడాఖ్ వేరే దేశాలట.. భారత్ చిత్రపటం వక్రీకరణ..
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య యుద్ధమే జరుగుతుంది. కొత్త ఐటీ చట్టాల నుంచి వార్ జరుగుతోంది. అయితే ట్విట్టర్ తన తీరును మార్చుకోవడం లేదు. దేశ సార్వభౌమత్వం పట్ల ట్విట్టర్ ధిక్కార స్వరం వినిపిస్తుంది. భారతదేశంలోని భూభాగాలను తప్పుగా చూపింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మకశ్మీర్, లడఖ్‌ను వేరే దేశంగా చూపి, భారత రాజకీయ చిత్ర పటాన్ని వక్రీకరించింది.
Recommended Video
ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను అమలు చేసే విషయంలో కేంద్రం-ట్విట్టర్ మధ్య ఘర్షణ పూరిత వాతారణం నెలకొంది. తాజా చర్యతో ట్విట్టర్‌పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనే అవకాశం ఉంది. ట్విటర్ తన 'ట్వీప్ లైఫ్' సెక్షన్‌లో జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్ భూభాగాలుగా చూపకపోగా, వాటిని వేరే దేశంగా చూపించింది.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో కూడా లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన సంగతి తెలిసిందే. నూతన ఐటీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు ట్విటర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అది తనకు ఉన్న మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఫైల్ అవువుతున్నాయి.
ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంటపాటు నిలిపివేసింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ధిక్కార ధోరణిని నిలదీసినందుకే తన ఖాతా నిలిపేసి ఉంటారని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ వెంటనే ఇలా.. జమ్ముకశ్మీర్, లడాఖ్‌ను వేరే దేశంగా చూపించి.. తన పైత్యాన్ని ప్రదర్శించింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications