ఐసియూలో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రికి చికిత్స
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ను బుధవారం ఐసియూకు తరలించారు. సయీద్‌కు ఆక్సిజన్ థెరపీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
డిసెంబర్ 24న సీఎం ముఫ్తీ సయీద్‌కు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్‌లో చేర్చారు. సయీద్‌కు తోడుగా ఆయన కుమార్తె, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వచ్చారు.

కాగా, మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌ను సందర్శించి సయీద్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. సీఎం సయీద్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పిడిపి.. బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications