జమ్మూ వరదలు: ఆలస్యం, జవాన్లపై దాడి(పిక్చర్స్)
హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ ఇంకా వరద విలయం నుండి తేరుకోలేదు. జమ్మూ కాశ్మీర్ వరదల వల్ల ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 200కు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 75వేల మందిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తొంది. ఇంకా దాదాపు 6 లక్షల మంది ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు.
వరదల్లో చిక్కుకున్న వారికోసం సైన్యం, వైమానికి దళం, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. వరద బాధితులకు విమానాల ద్వారా ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. 61 విమానాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వైమానిక అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మెరైన్ కమాండోలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే టెలిఫోన్ వ్యవస్దను పునరుద్దరిస్తున్నారు. వారం రోజుల తర్వాత శ్రీనగర్ - లేహ్ జాతీయ రహాదారిని పునరుద్దరించే అవశాకాలు ఉన్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే సహాయక చర్యల కోసం వెళ్లిన ఇద్దరు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిపై బాధితులు ఆగ్రహంతో దాడి చేశారు.
సహాయం అందించేందుకు ఆలస్యంగా వచ్చారంటూ హెలికాప్టర్లపై బాధితులు రాళ్లు విసిరారు. దీంతో సహాయకచర్యలకు కొంత సేపు ఆటంకం ఏర్పడింది. స్దానికుల దాడిలో గాయపడిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని చంఢీఘడ్ హాస్పిటల్‌కి తరలించారు. ఐతే బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్ వరదలు దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలను కలచివేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి సహాయం చేసేందుకు వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించగా, అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రూ. 5 కోట్లు సాయం ప్రకటించారు. ఎలాంటి ఇతర సహాయమైనా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ వరద బాధితుల సహాయార్దం రూ. 5 కోట్లు ప్రకటించగా, మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు, బీహార్ ప్రభుత్వం రూ. 10 కోట్లు ప్రకటించాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీంతో పాటు 300 టన్నుల పౌష్టిక ఆహారాన్ని కూడా కాశ్మీర్ కు పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే, తొలివిడతగా 140 మెట్రిక్ టన్నుల ఆహార పొట్లాలను కాశ్మీర్ కు పంపామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులు తావి నది ఒడ్డున ఉన్నారు. చిత్రంలో తావి నదిపై నిర్మించిన వంతెన కొట్టుకుపోయిన దృశ్యం.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
జమ్మూ వరదల్లో ఇసుకలో కూరుకుపోయిన లారీని చూస్తున్న ప్రజలు.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మెరైన్ కమాండోలు కూడా రంగంలోకి దిగారు. తావి నది వరదల నుండి ఓ బాలుడిని రక్షించిన సైన్యం.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మెరైన్ కమాండోలు కూడా రంగంలోకి దిగారు. తావి నది వరదల నుండి ఓ బాలుడిని రక్షించిన సైన్యం.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల కారణంగా కూలిన తన ఇంటిని చూస్తున్న ఓ బాలుడు.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల కారణంగా ప్రజలను కాపాడేందుకు తాత్కాలిక వంతెనను నిర్మించిన సైనికులు.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
తావి నది వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు. ఇంటిని తీక్షణంగా పరిశీలిస్తున్న బాధితులు.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయతో సీనియర్ లీడర్లు జెపి నడ్డా వరదల బాధితుల కోసం ఆహారం, మందులు పంపిస్తున్న దృశ్యం.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల కారణంగా ప్రజలను కాపాడేందుకు తాత్కాలిక వంతెనను నిర్మించిన సైనికులు.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
రౌజారి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నది.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల నుండి రక్షించిన టూరిస్ట్‌లను శ్రీనగర్‌లోని ఎయిర్ బేస్ నుండి వారి వారి ప్రాంతాలకు తరలిస్తున్న విమానం.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
సహాయక చర్యల కోసం వెళ్లిన ఇద్దరు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిపై బాధితులు ఆగ్రహంతో దాడి చేశారు. సహాయం అందించేందుకు ఆలస్యంగా వచ్చారంటూ హెలికాప్టర్లపై బాధితులు రాళ్లు విసిరారు. దీంతో సహాయకచర్యలకు కొంత సేపు ఆటంకం ఏర్పడింది.

వరదల నుంచి తేరుకోని జమ్మూ కాశ్మీర్
వరదల కారణంగా కొట్టుకపోయిన గుడి. ఫోటోలో కనిపిస్తున్న వినాయకుడి విగ్రహాం.












Click it and Unblock the Notifications