పహల్గాం టెర్రరిస్టులకు హెల్ప్ చేసిన ముగ్గురు ప్రభుత్వ అధికారులు.. కేంద్రం కీలక నిర్ణయం..?

ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా బైసరన్ లోయలోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మన దేశంలోనే ఉంటూ పాకిస్థాన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్ష్యంగా సపోర్ట్ చేస్తున్నవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటివారిని అరెస్ట్ చేసి దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేసింది పోలీసు యంత్రాంగం. తాజాగా ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లష్కర్ ఏ తోయిబా, హిజ్ బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్ము కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. వారిని విధుల నుంచి బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం. గత ఐదేళ్లలో ఉగ్రవాదులతో రిలేషన్ ఉన్న 83 మందిని గుర్తించి వారిని సెక్షన్ 311(c) కింద విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది.

J amp amp K Govt Dismisses Three Employees Over Terror Links

మంగళవారం తాజాగా తొలగించిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు విధుల నుంచి తొలగించిన వారిలో మాలిక్ ఇష్ ఫక్ నజీర్(పోలీసు కానిస్టేబుల్), అజాజ్ అహ్మద్(టీచర్), వసీమ్ అహ్మద్ ఖాన్(జూనియర్ అసిస్టెంట్) ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీళ్లంతా లష్కర్ ఏ తోయిబా, హిజ్ బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్ర సంస్థలకు గూఢచారులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాక పహల్గాం ఉగ్రావాదులతోనూ ఈ ముగ్గురు ఉద్యోగులకు సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాదులకు వీళ్లు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేశారు. వీళ్లను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి గూఢచారులను అధికారులు అరెస్ట్ చేశారు. మరికొంత మంది యూట్యూబర్లు, ప్రభుత్వ ఉద్యోగులపైనా కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది.

ఇక ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు రక్షణశాఖ పేర్కొంది. అంతేకాకా సింధూ నది జలాల పంపణీ రద్దు, అటల్- వాఘా బోర్డర్ మూసివేత, వీసాల జారీ రద్దు, ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిషేధం లాంటి పలు కఠిన చర్యలు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+