Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి: తమ పనేనంటూ లష్కరే తొయిబా

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. అచాబల్‌ పట్టణంలో భద్రతా సిబ్బంది క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయాలపాలయ్యారు.

కాల్పుల్లో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడు. ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు.చనిపోయిన ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లను అసిస్టెంట్‌ సబ్‌-ఇన్స్‌పెక్టర్‌ మీనా, కానిస్టేబుల్‌ సందీప్‌లుగా గుర్తించారు.

J&K: Two CRPF jawans killed in Anantnag attack, LeT claims responsibility

కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతను పెంచిన పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+