Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్ కే నగర్ చిచ్చు: శశికళ మన్నార్ గుడి ఫ్యామిలీ ఫైట్, నువ్వా నేనా, వర్గపోరు!

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత చిన్నమ్మ శశికళ నటరాజన్ మన్నార్ గుడి ఫ్యామిలీలో రాజకీయ వారసత్వ పోరు మొదలైయ్యింది. జయలలిత, శశికళ రాజకీయ వారసులు మేమంటే మేమే అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీని కాపాడేది మేము అంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. అమ్మ, చిన్నమ్మ వారుసులు నువ్వా నేనా అంటున్నారు.

ఆర్ కే నగర్ చిచ్చు

ఆర్ కే నగర్ చిచ్చు

ఆర్ కే నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలనే కాదు వీకే శశికళ నటరాజన్ కుటుంబంలో సైతం కలకలం సృష్టించాయి. కుటుంబసభ్యులతో శశికళ భర్త నటరాజన్‌ తన ఇంటిలో రెండు రోజుల క్రితం నిర్వహించిన వారసత్వ పంచాయితీ అందుకు అద్దం పడుతోంది.

టీటీవీ దినకరన్

టీటీవీ దినకరన్

అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడి బాధ్యతల నుంచి తప్పుకునేందుకు టీటీవీ దినకరన్‌ సిద్ధపడే వరకు శశికళ ఫ్యామిలీలో పంచాయితీ జరిగింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాదించిన టీటీవీ దినకరన్‌ తానే జయలలిత, శశికళకు అసలైన రాజకీయ వారసుడు అని ప్రకటించడం మన్నార్ గుడి ఫ్యామిలీలో చిచ్చు రేపింది.

దినకరన్ తమ్ముడు ఎంట్రీ

దినకరన్ తమ్ముడు ఎంట్రీ

ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీకి జయలలిత తరువాత తామే వారసులమని రుజువైందని టీటీవీ దినకరన్‌ తమ్ముడు టీటీవీ భాస్కరన్‌ ప్రచారం చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గం దగ్గర రెండాకుల చిహ్నం మాత్రమే ఉంది, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు తమవైపు ఉన్నారని టీటీవీ భాస్కరన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 అమ్మ వీడియో చిచ్చు

అమ్మ వీడియో చిచ్చు

అమ్మ జయలలిత మరణానికి శశికళ కారణమని దేశవ్యాప్తంగా ఆరోపించినా ఆమె మౌనంగా భరించారని, అయితే ఎన్నికల కోసం అపోలో ఆసుపత్రిలో చికిత్స దృశ్యాలను విడుదల చేసి జయలలితను టీటీవీ దినకరన్‌ అవమానపరిచారని ఫేస్‌బుక్ లో, మీడియా ముందు క్రిష్ణప్రియ విమర్శించారు.

క్రిష్ణప్రియ ప్రకటన

క్రిష్ణప్రియ ప్రకటన

టీటీవీ దినకరన్‌ అనుచరుడు, అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ నమ్మకద్రోహానికి పాల్పడి వీడియో విడుదల చేశారని, తానే శశికళ వారసురాలినని ఆమె మేనకోడలు క్రిష్ణప్రియ ప్రకటించుకోవడం టీటీవీ దినకరన్‌ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ క్రిష్ణప్రియ ఎవరని టీటీవీ దినకరన్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

అందరూ వారసులే?

అందరూ వారసులే?

శశికళ సోదరుడు దివాకరన్, టీటీవీ దినకరన్, టీటీవీ భాస్కరన్, జయా టీవీ ఎండీ వివేక్, క్రిష్ణప్రియ ఎవరికి వారు తామే జయలలిత, శశికళ వారసులు అంటూ ప్రకటించుకోవడం వారి కుటుంబ సభ్యుల్లో చిచ్చురేపింది. ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

 జయలలిత ఇంట్లో?

జయలలిత ఇంట్లో?

ఎప్పుడో జయలలిత సమక్షంలో పోయెస్ గార్డెన్ లో క్రిష్ణప్రియకు శ్రీమంతం జరిగిందని, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీటీవీ దినకరన్ ప్రశ్నిస్తున్నారు. ఇలాగే చేస్తూ పోతే మన కుటుంబ సభ్యులు మళ్లీ చిక్కుల్లో పడే అవకాశం ఉందని, ఈ వ్యవహారం తాను జైల్లో చిన్నమ్మ శశికళతో మాట్లాడి తేల్చుకుంటానని టీటీవీ దినకరన్ హెచ్చరించారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+