బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసులో 7కోట్లఆస్తులు అటాచ్!!

200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చెందిన 7.27 కోట్ల రూపాయల ఆస్తిని అటాచ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ పాత్రపై ఈడీ దర్యాప్తు

మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ పాత్రపై ఈడీ దర్యాప్తు


మనీలాండరింగ్ కేసులో 2019లో జైలుకెళ్లిన రాన్‌బాక్సీ మాజీ యజమాని శివిందర్ సింగ్ కుటుంబం నుంచి బలవంతంగా వసూలు చేసిన 200 కోట్ల రూపాయల నగదు నుంచి చంద్రశేఖర్ జాక్వెలిన్ కు 5.71 కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.చంద్రశేఖర్ నుండి 52 లక్షల విలువైన గుర్రం, 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, రత్నాలు పొదిగిన చెవిపోగులు మరియు హీర్మేస్ బ్రాస్‌లెట్ వంటి బహుమతులతో పాటుగా చంద్రశేఖర్ నుండి 1.5 లక్షల డాలర్ల రుణాన్ని అందుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఆమె ఒక మినీ కూపర్ కారును కూడా సుకేష్ నుండి అందుకుంది. అది ఆమె తర్వాత తిరిగి ఇచ్చిందని తెలుస్తుంది.

 7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ


సుకేష్ చంద్రశేఖర్ అక్రమార్జన మరియు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం జప్తు చేసింది. ఆరోపణ ప్రకారం, సుకేష్, తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు, ఒక వ్యాపారవేత్త భార్య నుండి డబ్బు వసూలు చేశాడు. నటుడు సుకేష్‌తో నగదు లావాదేవీలను వెలికితీసినట్లు ఈడీ గతంలో చేసిన ఆరోపణకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు బయటకు వచ్చింది.

 రాన్ బాక్సీ ప్రమోటర్లను మోసం చేసిన వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసు

రాన్ బాక్సీ ప్రమోటర్లను మోసం చేసిన వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసు


సుకేశ్ చంద్రశేఖర్ మరియు అతని నటుడు-భార్య లీనా మరియా పాల్‌ వ్యాపార వేత్తను మోసం చేసిన వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదైంది. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు అయిన మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తా అని నమ్మించి వారి భార్యల నుండి 200 కోట్ల రూపాయలు వసూలు చేశాడు సుకేష్ చంద్ర శేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆమె తన భర్తను విడుదల చేసేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి తన వద్ద నుండి డబ్బు తీసుకున్నాడని ఆరోపించింది.

 సుకేష్ చంద్రశేఖర్ నుండి ఖరీదైన బహుమతులు .. అందుకే ఆస్తులు అటాచ్

సుకేష్ చంద్రశేఖర్ నుండి ఖరీదైన బహుమతులు .. అందుకే ఆస్తులు అటాచ్


దీంతో 200 కోట్ల రూపాయలకు మోసం చేసిన కేసులో సుకేష్ చంద్ర శేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక సుకేష్ చంద్ర శేఖర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నందుకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను కూడా ఈడీ విచారించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సుకేష్ చంద్ర శేఖర్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలోనే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసినట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+