ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్, మార్గరెట్ అల్వాపై ఘన విజయం
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ గెలుపొందారు. ప్రత్యర్థ మార్గరెట్ అళ్వాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఇంతకుముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ప్రచ్చన్న యుద్దమే జరిగింది. ఎన్డీఏ అతనిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. మార్గరెట్ అళ్వాకు 128 ఓట్లు రాగా.. దాదాపు 340 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారత 14వ ఉప రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేస్తారు. అయితే 15 ఓట్లు చెల్లలేవట.అలాగే టీఎంసీ నుంచి 34 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
Recommended Video


లోక్ సభ, రాజ్యసభలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ ఉంది. అందుకోసమే ధన్ కర్ విజయం నల్లేరుమీద నడకలా సాగింది. రెండు సభలలలలో కలిపి 788 మంది సభ్యులు ఉండగా.. 725 మంది ఎంపీలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జగదీప్ ధన్ కర్ రాజస్థాన్ జుంజును జిల్లాలో మారుమూల ప్రాంతంలో జన్మించారు. పాఠశాల విద్య సైనిక్ స్కూల్‌లో జరిగింది. ఫిజిక్స్‌లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఎల్ఎల్‌బీ చేశారు. రాజస్థాన్‌లో మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా లీడ్ లాయర్‌గా కొనసాగారు.
1989లో రాజకీయాల్లోకి వచ్చారు. తన సొంత జిల్లా నుంచి లోక్ సభకు పోటీ చేశారు. జనతాదళ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ధన్ కర్ జాట్ కులానికి చెందిన వారు. ఈయనకు సుదేశ్ ధన్‌కర్ అనే భార్య ఉంది. ఉత్తర భారత దేశంలో జాట్ల ప్రాబల్యం ఎక్కువ.. ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications