వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణం: ప్రధాని మోడీ, వెంకయ్య హాజరు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ధన్‌కర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు జగదీప్ ధన్‌కర్.. రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌కర్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై గెలుపొందారు. ఆయన 528 ఓట్లు రాగా, ఆల్వాకు 182 ఓట్లు రావడంతో విజయం సాధించారు.

Jagdeep Dhankhar Sworn In As 14th Vice President Of India In Presence Of PM Modi

ఎవరీ జగదీప్ ధన్‌కర్?

జగదీప్ ధన్‌కర్.. మే 18, 1951న రాజస్థాన్‌లోని జుంఝును ప్రాంతంలోని ఒక కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు.

భౌతికశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బి చదివారు. మొదటి తరం ప్రొఫెషనల్ అయినప్పటికీ, అతను రాష్ట్రంలోని అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరిగా ఎదిగారు.

71 ఏళ్ల జగదీప్ ధన్‌కర్ రాజస్థాన్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగారు.

1989 లోక్‌సభ ఎన్నికలలో ఆయన.. జనతాదళ్ టిక్కెట్‌పై జుంజును నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ ఉప ప్రధాని అయిన దేవి లాల్ నిజానికి ఆయన రాజకీయాలను ప్రభావితం చేశారు.

Recommended Video

ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia

1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గెలిచిన ధన్‌ఖర్ రాష్ట్ర రాజకీయాలపై తన దృష్టిని కేంద్రీకరించారు.

English summary
Jagdeep Dhankhar Sworn In As 14th Vice President Of India In Presence Of PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X