జహంగిరి పురీలో నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు విచారణ
హనుమాన్ శోభయాత్ర సందర్భంగా చెలరేగిన హింస జహంగిర్ పురిలో కంటిన్యూ అవుతుంది. పేద ముస్లింల దుకాణ సముయాదాలను కూల్చివేయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం కలుగజేసుకుంది. ఇవాళ కేసు విచారిస్తోంది. అయితే ఆందోళనలు చేసిన వారు జహంగిర్ పురిలో అక్రమంగా నిర్మాణాలు నిర్మించారని బీజేపీ నేతలు ఆరోపించారు. వాటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాల డ్రైవ్ చేపట్టారు. కొన్నింటిని కూల్చివేయగా.. సుప్రీంకోర్టు కలుగజేసుకుంది. నిర్మాణాల కూల్చివేతపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. గురువారం విచారిస్తామని.. అప్పటివరకు స్టేటస్ కో ఉంటుందని స్పష్టంచేసింది. దీంతో నిర్మాణాల కూల్చివేతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే దీనిని ప్రతిపక్షాలు ఖండించాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు.
జహంగీర్ పురిలో మైనార్టీలు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గం కావాలనే తమపై దాడికి దిగిందనేది హిందువుల అంటున్నారు. హింసకు పాల్పడినవారి అక్రమ నిర్మాణాలను గుర్తించి, బుల్డోజర్లతో కూల్చివేయాలంటూ న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా లేఖ రాశారు. ఆ తర్వాత రోజే ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కావడం, భద్రతా దళాలతో దుకాణాలు నేలమట్టం చేశారు.

నోటీసులు లేకుండా ఇలా దుకాణాలు కూల్చేయడం సరికాదంటూ సుప్రీంకోర్టులో జమైత్ ఉలామా-ఇ-హింద్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం ఉత్తర్వులతో కూల్చివేతలు ఆగాయి. యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉన్నా.. న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ ఆధీనంలో ఉంది. మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ బీజేపీకి చెందిన వారు ఉన్నారు. అతని అత్యుత్సాహం వల్లే ఇలా షాపులన్నీ ఒక్క రోజులో నేలమట్టం అయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆక్రమణలు తొలగించే పద్ధతి ఇదేనా అని మండిపడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది.












Click it and Unblock the Notifications