లాలూకు ఊరట: ఆరు వారాల బెయిల్ మంజూరు చేసిన కోర్టు
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు ఊరట లభించింది. ఆరు వారాల పాటు లాలూ ప్రసాద్ యాదవ్‌కు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేస్తూ రాంచీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు ఆరువారాల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అనారోగ్యం, వైద్య కారణాలతో ఆరు వారాల తాత్కాలిక బెయిల్‌ను రాంచీ హైకోర్టు మంజూరు చేసింది.

తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం కోసం లాలూ ఇప్పటికే పెరోల్‌పై విడుదలయ్యారు. గురువారం నాడు సాయంత్రం పాట్నా చేరుకొన్నారు. బిర్సాముందా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన సమయంలో ఆరోగ్య పరిస్థితులను కూడ కోర్టుకు విన్నవించారని సమాచారం. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరాలనే ఆంశాలను కూడ ప్రస్తావించారని సమాచారం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు లాలూకు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications