కావ్యా పాపను ఆ స్థితిలో చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది- రజినీకాంత్ సంచలనం

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం.. జైలర్. పాన్ ఇండియా మూవీ ఇది. సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ కింద కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. కన్నడ, మలయాళ సూపర్ స్టార్స్ శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమన్నా హీరోయిన్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు.

ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా జైలర్ ఆడియోను లాంచ్ చేసింది చిత్రం యూనిట్. చెన్నైలో గ్రాండ్‌గా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. రజినీకాంత్, తమన్నా, శివ రాజ్‌కుమార్.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అద్దిరిపోయే పెర్మార్మెన్స్ ఇచ్చారిందులో.

Kavya Maran

ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్.. మరెవరో కాదు. ఏపీ, తెలంగాణల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబద్ యజమాని. ఆయన కూతురే కావ్యా మారన్. కావ్యా మారన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఆమె రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు చిరపరిచితురాలయ్యారు.

జైలర్ ఆడియో లాంచ్ ప్రోగ్రామ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తావనను తీసుకొచ్చారు రజినీకాంత్. కళానిధి మారన్‌కు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. టీమ్‌లో మంచి ప్లేయర్లను పెట్టుకోవాలని చెప్పారు. ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ను గెలవాలనే కసి ఉన్న క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించాలని పేర్కొన్నారు తలైవా.

Rajinikanth

దీనికి కారణాన్ని కూడా చెప్పుకొచ్చారాయన. సన్‌రైజర్స్ హైదరాబాద్.. మ్యాచ్ ఓడిపోయినప్పుడు కావ్యా మారన్ పడే బాధను తాను చూడలేకపోతున్నానని అన్నారు రజినీ. స్టేడియంలో కావ్యా మారన్ నిరాశగా ఉండటాన్ని చాలాసార్లు చూడలేకపోయాననీ చెప్పారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఛానల్ మారుస్తానని పేర్కొన్నారు. ఈ సారి మెగా ఆక్షన్‌లో మెరికల్లాంటి ప్లేయర్లను తీసుకోవాలని అన్నారు.

ఐపీఎల్‌లో కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్..నాసిరకం ఆటతీరును ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. 2020 సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన ఎస్ఆర్‌హెచ్.. ఆ తరువాత డీలా పడింది. ఆ స్థాయిలో ఆడట్లేదు. 2021లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2020లోనూ ఈ జట్టు స్థానం ఎనిమిదే. ఈ ఏడాది ఐపీఎల్‌లో మరింత దిగజారిందా జట్టు. పదో స్థానంతో తన ప్రస్థానాన్ని ముగించింది.

Rajinikanth

మ్యాచ్‌లు ఓడినపోయిన ప్రతీసారీ.. కావ్యా మారన్ తీవ్ర నిరాశలో కనిపిస్తుంటారు స్టేడియంలో. ఎన్నో ఎక్స్‌ప్రెషన్స్ రోలర్ కోస్టర్‌గా ఆమె ముఖంలో వచ్చీపోతుంటాయి. మ్యాచ్ గెలిస్తే పట్టరాని ఆనందంతో ఎగిరి గంతేసిన రోజులు కూడా లేకపోలేదు. మ్యాచ్ ఓడిన ప్రతీసారీ నిరాశ, నిస్పృహల్లో మునిగిపోతుంటారామె. ఆ స్థితిలో కావ్యాను చూడలేకపోతున్నానంటూ రజినీకాంత్ చెప్పడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+