సహజీవనం: పెళ్లంటే వదిలేశాడు, బాధితురాలి ఫిర్యాదు

జైపూర్: తనపై తన భాగస్వామి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు భౌతికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ గ్రీన్‌నగర్‌లో ఉంటూ ఓ వ్యక్తితో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తోంది. 2009లో సవాయిమదోపూర్‌లోని తమ ఇంటి నుంచి బాధిత మహిళ పారిపోయి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడే నిందిత వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు.

ఈ నేపథ్యంలో అతనితోనే బాధిత మహిళ సహజీవనం చేస్తోంది. పలుమార్లు నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో ఆమె 2010లో గర్భం దాల్చింది. దీంతో తనను వివాహం చేసుకోవాలని బాధిత మహిళ అతనిపై ఒత్తిడి తెచ్చింది.

 Jaipur woman alleges rape, physical abuse by live-in partner

ఈ క్రమంలో బాధిత మహిళను దూషించిన నిందితుడు, అంతటితో ఆగకుండా ఆమెను చితకబాదాడు. తనతో ఉండవద్దని హెచ్చరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దోపిడీ: భార్య హత్య, భర్తకు గాయాలు

రాజస్థాన్ రాష్ట్రంలోని గణేష్ విహార్ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన దొంగలు, ఆ ఇంట్లోని మహిళను హత్య చేశారు. వారి దాడిలో మృతురాలి భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బ్రహ్మిదేవి(55) అనే మహిళ తన ఇంట్లో టీ చేస్తుండగా దోపిడీ దొంగలు దొడ్డిదారి గుండా వారింట్లోకి ప్రవేశించారు.

బ్రహ్మిదేవిపై కత్తితో దాడి చేసిన దొంగలు, ఆమె భర్త రాంసింగ్‌పై దాడి చేశారు. వారి అరుపులతో దొంగలు అక్కడ్నుంచి ఏమి అపహరించకుండానే పరారయ్యారు. కాగా, బ్రహ్మిదేవి ఈ ఘటనలో మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రాంసింగ్‌ను చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో వినోద్ మండల్ అనే హోటల్ వర్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+