సస్పెన్స్‌కు తెర: హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా జైరాం ఠాకూర్

Posted By:
Subscribe to Oneindia Telugu

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త సీఎంగా జైరామ్ ఠాకూర్ పేరును ఖరారు చేశారు.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. జైరాం హిమాచల్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Jairam Thakur Himachal Pradesh's new CM

ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

సీఎం రేసులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేరు కూడా వినిపించింది. చివరకు శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు జైరాం ఠాకూర్‌ను ఎన్నుకున్నారు. 52 ఏళ్ల ఠాకూర్ గతంలో పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jairam Thakur, Himachal Pradesh's new chief minister, thanked BJP cadres and leaders for their support after party observers and legislators picked him over Jagat Prakash Nadda, another contender for the top post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి