భారత్‌పై మరో ఆత్మాహుతి దాడికి కుట్ర! విరాళాలు అడుగుతున్న జైష్!!

ఇండియాపై పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మరోసారి ఆత్మాహుతి దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తోందని.. ఇందుకోసం నిధులను సేకరిస్తోందని నిఘా వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ సంస్థ ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించాయి.

మరోసారి ఉగ్రదాడి చేసేందుకు సేకరిస్తున్న విరాళం దాదాపు 20 వేల పాకిస్తాన్ రూపాయలు కాగా.. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.6,400 ఉంటుంది. ఈ మొత్తాన్ని ఫీల్డ్‌లో ఉన్న ఉగ్రవాదికి అవసరమైన వస్తువులు అంటే బూట్లు, ఉన్ని సాక్సులు, ఒక పరుపు, ఒక టెంట్ వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. 'ముజాహిద్' (పోరాట యోధుడు) కోసం వింటర్ కిట్‌ను అందించేవారిని 'జిహాదీ'గా పరిగణిస్తామని జైష్ నాయకులు పిలుపునిచ్చారు. అలాగే 'జిహాదీ' చనిపోయిన తర్వాత అతనిని 'పట్టించుకునే' వారు కూడా 'జిహాదీ'గా పిలవబడతారు.

Jaish-e-Mohammed New Plot to Attack India Digital Fundraising and Women Leadership in Terrorism

డిజిటల్ ఫండింగ్.. మహిళా అటాక్ కుట్ర
ఎర్రకోట పేలుడు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాల ప్రకారం.. జైష్ నాయకులు డిజిటల్ మార్గాల ద్వారా ముఖ్యంగా పాకిస్థాన్ యాప్ అయిన సదాపే (SadaPay) ద్వారా నిధులు సేకరించాలని పిలుపునిచ్చారు. ఈసారి మహిళల నేతృత్వంలో దాడికి పాల్పడే అవకాశం ఉందని కూడా నిఘా వర్గాలు తెలిపాయి. జైష్‌-ఎ-మొహమ్మద్‌కు ఇప్పటికే 'మహిళా విభాగం' ఉంది. దీనిని 'జమాత్ ఉల్-ముమినత్' అని పిలుస్తారు. టెర్రర్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా ఈ యూనిట్‌కు నాయకత్వం వహించే బాధ్యతను తీసుకున్నారు. ఎర్రకోట పేలుడుకు ఆర్థిక సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితురాలు డాక్టర్ షాహీనా సయీద్ (కోడ్‌నేమ్ 'మేడమ్ సర్జన్') కూడా ఈ యూనిట్‌లో సభ్యురాలని నివేదికలు సూచిస్తున్నాయి.

ఢిల్లీ ఎర్రకోట దాడి వివరాలు
నవంబర్ 10న చారిత్రక ఎర్రకోట సమీపంలో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ANFO), ఇతర పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మరణించారు. ఈ కారును డాక్టర్ ఉమర్ మహమ్మద్ నడిపాడు. అతను పేలుడులో మరణించాడు. ఆత్మాహుతి బాంబు దాడులను "తప్పుగా అర్థం చేసుకున్నారు" అని ఉమర్ మహమ్మద్ సెల్ఫీ వీడియో మంగళవారం నెట్టింట వైరల్ అయింది. ఎర్రకోట దాడిని నిర్వహించిన 10 మంది సభ్యుల 'టెర్రర్ డాక్టర్' బృందానికి త్వరితగతిన నిధులను బదిలీ చేయడమే ఈ డిజిటల్ ఫండింగ్ నెట్‌వర్క్ లక్ష్యమని తెలిసింది.

జైష్-లష్కర్ కొత్త వ్యూహం
ఈ నెల ప్రారంభంలో అందిన తాజా నిఘా సమాచారం ప్రకారం.. పాక్ మద్దతుగల ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్‌లో ప్రమాదకరంగా పెరుగుతోంది. జైష్, లష్కరే తోయిబా వంటి ప్రధాన సమూహాలు సమన్వయ దాడుల కొత్త వేవ్ కోసం సిద్ధమవుతున్నట్లు ఆ సమాచారం వెల్లడించింది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు పాక్ సైన్యం, ఆ దేశ 'డీప్ స్టేట్' ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+