వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా ఉగ్ర దాడిలో కీలకంగా ఉన్న జైషే చీఫ్ బంధువు, ఉగ్రవాది హతం .. జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో జైష్ ఏ మహ్మద్ కు చెందిన పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది మరణించారు . మొహమ్మద్ ఇస్మాల్ అల్వి ఈ ఎన్కౌంటర్లో మరణించినట్లు తెలుస్తోంది. అతనిని లంబూ అలియాస్ అద్నాన్ అని కూడా పిలుస్తారు.

2019 పుల్వామా ఉగ్రదాడి కుట్ర మరియు ప్రణాళికలో పాల్గొన్న జైష్-ఇ-మొహమ్మద్ యొక్క కీలక ఉగ్రవాది శనివారం జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మొహమ్మద్ ఇస్మాల్ అల్వి జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందినవారని, మసూద్ అజార్ కు బంధువు అని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులలో పాకిస్థాన్‌కు చెందిన ఇస్మాల్ కూడా ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జిషీట్ లో అతని పేరు కూడా ఉంది.

Jaish-e-Mohammed Terrorist And Pulwama Attack Conspirator Killed In J&K Encounter

పుల్వామాలోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్, కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
సైన్యం యొక్క సెర్చ్ కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, వారు ప్రతీకార దాడులకు దిగారు అని ఆర్మీ వెల్లడించింది. వారికి , భద్రతా దళానికి మధ్య జరిగినఎదురుకాల్పుల్లో ఇస్మాల్ అల్వి మరియు మరో ఉగ్రవాది మరణించారు. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని గుర్తించే క్రమంలో ఉన్నారు. కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), విజయ్ కుమార్ ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. శనివారం నాటి ఆపరేషన్ విజయవంతం అయినందుకు సైన్యాన్ని, పోలీసులను కూడా ఆయన అభినందించారు.

పుల్వామా ఉగ్రదాడి కాశ్మీర్‌లో దశాబ్దాలలో భద్రతా దళాలపై జరిగిన అత్యంత దారుణమైన దాడి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కాన్వాయ్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్- ఏ-మహ్మద్ ఆత్మాహుతి దాడి చేసినప్పుడు 40 మంది సైనికులు మరణించారు. కొన్ని రోజుల తరువాత, భారతదేశం పాకిస్తాన్ యొక్క బాలాకోట్ లోని జైష్ శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వైమానిక దళంతో వైమానిక డాగ్ ఫైట్ జరిగింది. ఇది భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ దాడులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను అప్పటినుండి భారత్ సమర్థవంతంగా తిప్పి కొడుతూనే ఉంది.

English summary
A key terrorist of Jaish-e-Mohammed, who was involved in conspiracy and planning of the 2019 Pulwama terror attack, was killed in an encounter with security forces in Jammu and Kashmir on Saturday. Mohd Ismal Alvi, also known as Lamboo and Adnan, belonged to the family of Jaish chief Masood Azhar, the police said. Ismal, a Pakistani, is among the two terrorists killed in the encounter. He was also named in the chargesheet by National Investigation Agency (NIA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X