వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌లో చైనా విదేశాంగ మంత్రితో జై శంకర్ భేటీ...?: వార్నింగ్ షాట్ ఫైరింగ్‌పై చర్చ..

|
Google Oneindia TeluguNews

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళుతున్న విదేశాంగ మంత్రి జై శంకర్.. ఇవాళ టెహ్రాన్‌లో ఆగిపోయే అవకాశం ఉంది. అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇరుదేశాలకు సంబంధించి ధ్వైపాక్షిక అంశాలపై చర్చించే చాన్స్ ఉంది. షాంఘై సహకార దస్సులో పాల్గొనేందుకు జై శంకర్ మాస్కో వెళ్తున్నారు. ఇక్కడ ఎస్‌సీవో ఎనిమిది దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమవుతారు.

వాంగ్ యితో భేటీ తర్వాత.. ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్‌తో కూడా జైశంకర్ సమావేశమవుతారు. ఎస్‌సీవో సదస్సుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరైన సంగతి తెలిసిందే. శుక్రవారం చైనా రక్షణశాఖ మంత్రి జనరల్ వీ పెంగీతో మీట్ అయ్యారు. తూర్పు లడఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి గరించి చర్చించారు. అయితే తమ అంగుళం భూమిని కూడా వదులుకోబోదని స్పష్టంచేశారు. తమ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కోసం పాటుపడతామని తేల్చిచెప్పారు. యథతథా స్థితిని పునరుద్దరించాలని.. చైనా హద్దుమీరితే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు.

Jaishankar Will Stop Over in Iran Today; May Meet Chinese Counterpart..

Recommended Video

Chandrayaan-3 likely to Launch in early 2021|Gaganyaan Mission Update | Oneindia Telugu

మే నెల నుంచి గల్వాన్ వ్యాలీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. జూన్ 5వ తేదీన చైనా సైన్యం రాళ్లతో దాడి చేసింది. దీంతో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది వీర మరణం పొందారు. ఇక అప్పటినుంచి పరిస్థితి చేయిదాటుతూ వస్తోంది. గత నెల 29, 30, 31వ తేదీల్లో డ్రాగన్ మళ్లీ నియంత్రణ రేఖ దాటి వచ్చే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వార్నింగ్ షాట్ ఫైరింగ్ జరపడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్‌లోనే చైనా విదేశాంగ మంత్రితో జై శంకర్ భేటీ కాబోతున్నారు. కాల్పుల అంశం ఎజెండా వీరి భేటీ జరగబోతోంది.

English summary
External Affairs Minister S Jaishankar is likely to have a stopover in Iran on Tuesday on his way to a four-day visit to Russia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X