తమిళుల దెబ్బకు దిగొచ్చిన కేంద్రం: జల్లికట్టుకు లైన్ క్లియర్.. ఆర్డినెన్స్‌కు ఓకే
గత కొద్ది రోజులుగా తమిళులు చేస్తున్న ఆందోళనలతో ప్రభుత్వాలు దిగి వచ్చాయి. జల్లికట్టుకు లైన్ క్లియర్ అయింది.
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా తమిళులు చేస్తున్న ఆందోళనలతో ప్రభుత్వాలు దిగి వచ్చాయి. జల్లికట్టుకు లైన్ క్లియర్ అయింది. తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను కొద్దిపాటి మార్పులతో కేంద్రం ఆమోదించింది.
కేంద్ర న్యాయశాఖ ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించింది. జల్లికట్టుకు కేంద్రం ఓకే చెప్పడంతో మెరీనా బీచ్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

కాగా, జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ మెరీనా బీచ్‌లో యువత గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తోంది. వారికి సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, అజిత్ తదితరులు మెరీనా బీచ్‌లో ఆందోళనలో పాల్గొన్నారు.
యువతకు మద్దతుగా మరి కొంతమంది అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టనున్నారని సమాచారం. జల్లికట్టుకు మద్దతుగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ ఉపవాస దీక్షలో పాల్గొంటానని ప్రకటించారు. నటులు కమల్‌హాసన్, లారెన్స్, విశాల్ తదితరులు యువత చేస్తున్న శాంతియుత ఆందోళనకు మద్దతుగా నిలిచింది.












Click it and Unblock the Notifications