14 రోజుల కస్టడీకి జామియా షూటర్: రంగంలో దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్..
Recommended Video
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా దేశ రాజధానిలో మహా ప్రదర్శనను చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై కాల్పులకు తెగబడిన రామ్‌భక్త్ గోపాల్ శర్మను కస్టడీకి పంపించారు. ఢిల్లీ పోలీసులు ఆయనను శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. కేసు పూర్వాపరాలను వివరించారు. అనంతరం- ఆయనను 14 రోజుల పాటు ప్రొటెక్టివ్ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలను జారీ చేసింది న్యాయస్థానం.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ చేతికి..
ఈ కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చేతికి చేరింది. ఫలితంగా- ఈ 14 రోజుల పాటు గోపాల్ శర్మను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించే అవకాశాలు ఉన్నాయి. గోపాల్ శర్మ కుటుంబ నేపథ్యాన్ని మొదలుకుని.. అన్ని అంశాలనూ విచారణ పరిధిలోకి తీసుకుని రానున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. గోపాల్ శర్మకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. ఆయన స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ జిల్లా జెవర్‌కు ఓ ప్రత్యేక బృందాన్ని పంపించారు.

కాంగ్రెస్, ఆప్ చేసిన ఆరోపణలపైనా..
జామియా విద్యార్థులపై కాల్సులు జరిపిన ఘటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హస్తం ఉందంటూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించిన విషయం తెలిసిందే. గోపాల్ శర్మకు ఆర్థిక సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయని, పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పినట్టు తేలిందని, దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని వెల్లడించాలంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఇదే తరహాలో విమర్శలు గుప్పించింది. ఈ ఆరోపణల కోణంలోనూ తాము గోపాల్ శర్మపై విచారణ నిర్వహిస్తామని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications