మోడీని చూపి భయపెట్టొద్దు: జమాతే సయ్యద్ మదానీ

కాంగ్రెస్ మాత్రమే కాదని, కొన్ని ప్రాంతీయ పార్టీలదీ ఇదే తీరుగా ఉందన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ తడి గుడ్డతో గొంతు కోసినట్లు ముస్లిములను హత్య చేసిందని మండిపడ్డారు. ముస్లిములకు రిజర్వేషన్లకు సంబంధించి జైపూర్లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు.
'కుహనా లౌకిక పార్టీల్లారా..! ఎవరో అధికారంలోకి వస్తారని భయపెట్టవద్దు. తద్వారా ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించొద్దు. దాని బదులు మీరు సాధించిన ఘనతలేమిటో చెప్పుకోండి. ముస్లింలను భయపెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారి ఓట్లను దండుకోలేదు. దానికి బదులుగా పార్టీ, ప్రభుత్వ పనితీరు, ఇచ్చిన హామీల అమలు ద్వారానే ఓట్లను సాధించగలరు' అని చెప్పారు.
ఈ కుహనా లౌకిక పార్టీలు ముందు ప్రజలకు ఏం చేస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. "ప్రజలకు ఏమేం హామీలు ఇచ్చాయి? వాటిలో వేటిని అమలు చేశాయి? ఇంకా ఏవి పెండింగ్‌లో ఉన్నాయి? అని చెప్పాలి.. వీటి ఆధారంగానే ఓట్లు అడగాలి. అంతే తప్ప.. ఎవరో అధికారంలోకి వస్తారంటూ భయపెట్టి ఓట్లు అడగడం సరికాదన్నారు.
మరోవైపు అధికార కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టడానికి బిజెపి, వామపక్షాలు దీనినే అస్త్రంగా మలచుకుంటున్నాయి. ఓట్ల కోసం ఆ పార్టీ ప్రజలను పావులుగా వాడుకుంటోందని ధ్వజమెత్తాయి. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా వాడుకుంటోందో దీనిని బట్టే అర్థమవుతోందని, ఓట్లు రాబట్టుకోవడానికి ఓటర్లను భయపెడుతోందని, ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలుసుకుంటున్నారని బిజెపి ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వి మండిపడ్డారు.
విభజించి పాలించడంలోనే కాంగ్రెస్ విశ్వాసమని, హిందూ - ముస్లిముల మధ్య విభజన తీసుకు రావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుందని బిజెపి నేత సిద్ధార్థ నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన విభజన ఏ రూపంలో చేసినా మంచిది కాదని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వాదాన్ని కాపాడుకునేందుకు అటువంటి వాటిపై పోరాడాలని సిపిఎం నేత సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మరోవైపు మదానీ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. తాము ఓట్ల కోసం ఎలాంటి వ్యూహాలు పన్నడం లేదని పార్టీ అధికార ప్రతినిధి మీం అఫ్జల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications