వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెటర్లను పోలీసులు అర్థరాత్రి లేపి విచారించారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jammu and Kashmir cricketers questioned by police
జమ్మూ: పోలీసుల చేతిలో జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ క్రికెటర్లు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి క్రికెటర్లను పోలీసులు నిద్రలేపి, గంటల కొద్దీ ప్రశ్నించారు. మిలిటెంట్‌గా అనుమానిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తూ క్రికెటర్లు బస చేసిన హోటల్‌కు పోలీసులు వచ్చారు. రంజీ ట్రోఫీ గ్రూప్ సి మ్యాచులో చివరి రోజు హైదరాబాదుతో తలపడాల్సిన స్థితిలో పోలీసులు జమ్మూ కాశ్మీర్ క్రికెటర్లను ప్రశ్నించారు.

హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోలీసులు తమ హోటల్‌కి వచ్చి తమను ప్రశ్నించిన తీరును జట్టు ఆల్ రౌండర్ షమీవుల్లా బేగ్ ఫేస్‌బుక్‌లో వివరించాడు. పోలీసులు అర్థరాత్రి హోటల్‌కి వచ్చారని, తమను గంటల కొద్దీ ప్రశ్నించారని, దాంతో తాము రాత్రంతా నిద్రపోలేకపోయామని అతను అన్నాడు.

హోటల్‌లో తమ రంజీ ట్రోఫీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నందున తమ గదులకు తాము తలుపులు బిగించుకోలేదని, తాము దీర్ఘ నిద్రలో ఉన్న సమయంలో సాయుధ పోలీసులు తమ గదుల్లోకి వచ్చి తమను చుట్టిముట్టిన దిగ్భ్రాంతి నుంచి తాము ఇంకా కోలుకోలేకపోతున్నామని బేగ్ అన్నాడు.

తమకు అందిన సమాచారంతో జమ్మూలోని హోటళ్లను అన్నింటినీ గాలించామని, తాము క్రికెట్ జట్టును ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోలేదని జమ్మూ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజేష్ కుమార్ అన్నారు. హోటల్లో రంజీ జట్టు క్రికెటర్లు ఉన్నట్లు తమకు ముందస్తు సమాచారం లేదని, దాంతో అన్ని హోటళ్లలో మాదిరిగానే ఆ హోటల్లో కూడా సోదాలు చేశామని, వారు రంజీ ట్రోఫీ జట్టు క్రికెటర్లని కూడా తమకు తెలియదని ఆయన వివరించారు.

సాధారణమైన తనిఖీయే అయినప్పటికీ తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని బేగ్ ఆగ్రహంగా అన్నాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడుతున్న జాతీయ, అంతర్జాతీయ కీర్తి కలిగిన క్రికెటర్ల పట్ల ఇలా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నాడు.

English summary
Jammu and Kashmir Ranji cricketers had to endure a torrid time on Tuesday when they were woken up in the middle of night and questioned for hours by the police, which was looking for a suspected militant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X