దేశం తలను నరికి ముక్కలు ముక్కలు చేశారు: గులాంనబి అజాద్

దేశానికి తల భాగంగా ఉన్న జమ్ము అండ్ కశ్మీర్ ముక్కలు ముక్కలు చేశారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబి అజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోని జమ్ము కశ్మీర్ పునర్విజభన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గోన్న ఆయన కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశం యొక్క తలను నరికారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయంతో జమ్ము కశ్మీర్ చరిత్ర, సంస్కృతిలు ధ్వంసం అయి పోయాయని ఆయన ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 జమ్ము కశ్మీర్ ,భారత దేశాన్ని కలిపే వంతెన లాంటిదని ఆయన పేర్కోన్నారు. ఈనేపధ్యంలోనే జమ్ము కశ్మీర్ ను విభజించడం ద్వార దేశం యొక్క తలను నరకడమే కాకుండా రాష్ట్రాన్ని ముక్కలు, ముక్కలు చేశారని ఆయన అన్నారు.దీంతో జమ్ము కశ్మీర్ ఉనికి లేకుండానే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Jammu Kashmir ka tukde tukde kar diya Ghulam Nabi Azad

చైనాతో, పాకిస్థాన్‌తో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో సరిహద్దులు కలిగిన రాష్ట్ర ప్రజలతో ఇలాంటి ఆటలు ఆడటం ప్రమాదకరమని, ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం దేశద్రోహం లాంటిదేనని ఆజాద్‌ పేర్కొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేసి.. రాష్ట్రానికి బలగాలను పంపించి.. మాజీ సీఎంలైన మెహబుబా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లాలను గృహనిర్బంధంలో ఉంచి, కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని అన్నారు. ఇక జమ్మూకశ్మీర్‌ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ సర్కారు వమ్ము చేసిందని తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+