25 ఏళ్ల మహిళ మర్మాంగంలో కారం పోడి పోసి, బీర్ బాటిల్ చెక్కిన కాశ్మీర్ పోలీసులు !
జమ్మూ శివార్లలోని కనాచక్ పోలీసులు చోరీ కేసులో అరెస్టు చేసిన మహిళను నగ్నంగా తయారు చేసి ఆమె మర్మాంగంలో కారం పోడి చల్లి బీర్ బాటిల్ చొప్పించి నరకం చూపించారు. బంగారు నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అంటూ 10 రోజ
శ్రీనగర్: చోరీ కేసులో అరెస్టు అయిన 25 ఏళ్ల మహిళ పట్ల పోలీసులు నీచంగా ప్రవర్తించారు. ఆమెను నగ్నంగా తయారు చేసి రాక్షసులుగా మారిన పోలీసులు వారి పైత్యాన్ని చూపించారు. ఆమెకు పోలీస్ స్టేషన్ లోనే ప్రత్యక్ష నరకం చూపించిన ఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది.
జమ్మూ నగర శివార్లలోని కనాచక్ ప్రాంతంలో ఓ శ్రీమంతుల ఇంటిలో 25 ఏళ్ల మహిళ ఇంటి పని చేస్తోంది. శ్రీమంతుల ఇంటిలో ఇటీవల బంగారు నగలు చోరీ అయ్యాయని సమాచారం. ఇంటి యజమాని ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళపై అనుమానం !
ఇంటిలో పని చేస్తున్న మహిళ మీద యజమానులు అనుమానం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30వ తేదీన పోలీసులు ఆమెను అరెస్టు చేసి కనాచక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారణ సమయంలో పోలీసులు రాక్షసులుగా మారిపోయారు. మహిళను పోలీస్ స్టేషన్ లోనే అందరి ముందు నగ్నంగా తయారు చేశారు.

కారం పోడి పోసి బీర్ బాటిల్ చెక్కారు
బంగారు నగలు ఎక్కడ పెట్టావు చెప్పు అంటూ ఆమె మర్మాంగంలో కారం పోడి పోసి చిత్రహింసలకు గురి చేశారు. అంతటితో ఆమెను వదిలిపెట్టలేదు. బీర్ బాటిల్ తీసుకుని ఆమె ప్రేవేట్ భాగంలో చొప్పించి నరకం చూపించారు.

న్యాయస్థానం
చివరికి ఆ మహిళ కుటుంబ సభులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మే 10వ తేది (బుధవారం) ఆమెకు న్యాయస్థానం జామీను మంజూరు చేసింది. జామీను తీసుకున్న మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో న్యాయమూర్తికి చెప్పారు. కోర్టు ఆదేశాలతో ఆమెను జమ్మూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రిలో బాధితురాలు
కోర్టు ఆదేశాల మేరకు ఆమెను జమ్మూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యపరీక్ష చేయించారు. తనను చిత్రహింసలు పెట్టిన వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నారని బాధితురాలు తాధికారులకు సమాచారం ఇచ్చింది. పోలీసు అధికారులు ఈ విషయంపై విచారణ మొదలు పెట్టారు.

ఇంటి పని మానేస్తాను అంటే
శ్రీమంతుల ఇంటిలో తాను ఎలాంటి బంగారు నగలు చోరీ చెయ్యలేదని, ఇంటి పని మానేస్తాను అని చెప్పినందుకు తన మీద దొంగతనం కేసు పెట్టారని ఆమె పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. తాను చిత్రహింసల గురించి ఎక్కడ పై అధికారులకు ఫిర్యాదు చేస్తానో అని భయపడిన పోలీసులు తన భర్తను తప్పుడు కేసులో అరెస్టు చేశారని ఆరోపించింది. పోలీసులు ప్రవర్తించిన తీరు తెలుసుకున్న మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications